ఖాకీల కళంకం!

ABN , First Publish Date - 2021-06-11T05:05:44+05:30 IST

మీ భద్రత బాధ్యత మాదే.. మేము ఉన్నది మీ కోసమే.. అంటూ రాష్ట్రంలో పోలీసు శాఖ పీపుల్‌ ఫ్రెండ్లీగా గుర్తింపు తెచ్చుకుంటోంది. కానీ, అదే శాఖలో కొంతమంది ఖాకీల తీరు మొత్తం వ్యవస్థకే ముప్పు తెస్తోంది.

ఖాకీల కళంకం!

దారితప్పుతున్న నాలుగో సింహం
అరికట్టాల్సిన వారే అడ్డదారుల్లోకి..
వివాహేతర సంబంధాలతో శాఖ  పరువు బజారుకీడుస్తున్న వైనం
పోలీసుశాఖలో కలకలం రేపుతున్న  ఇందల్వాయి ఎస్‌ఐ వ్యవహారం
వారి వివాహేతర సంబంధంతో ఓ నిండు ప్రాణం బలి
గాంధారి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఇరు జిల్లాల పోలీసుబాసులు
ఇద్దరినీ తొలగించే అవకాశం
సెలవుపై వెళ్లిన సదరు ఎస్‌ఐ
ఉమ్మడి జిల్లాలో పలువురు పోలీసుల పని తీరుపై తీవ్ర విమర్శలు

కామారెడ్డి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మీ భద్రత బాధ్యత మాదే.. మేము ఉన్నది మీ కోసమే.. అంటూ రాష్ట్రంలో పోలీసు శాఖ పీపుల్‌ ఫ్రెండ్లీగా గుర్తింపు తెచ్చుకుంటోంది. కానీ, అదే శాఖలో కొంతమంది ఖాకీల తీరు మొత్తం వ్యవస్థకే ముప్పు తెస్తోంది. ఇటీవల ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు, సి బ్బంది వ్యవహరిస్తున్న తీరు ఫ్రెండ్లీ పోలీసుకు వ్యతిరేక అ ర్థాన్నిస్తోంది. ఇందుకు గాంధారిలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. ఓ వైపు ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలో శాం తి భద్రతలను కాపాడేందుకు శాయశక్తులా కృషిచేస్తుంటే.. శాఖలోని కొంతమంది అధికారులు, సిబ్బంది మాత్రం ఖాకీ చొక్కాను అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. వివా హేతర సంబంధాలు పెట్టుకోవడం, బెదిరింపులకు పాల్పడు తుండడం, సెటిల్‌మెంట్లు చేస్తుండడం, భూకబ్జాల్లో తలదూ ర్చుతుండడంలాంటి విషయాలు ఆ శాఖకు మచ్చని తెచ్చి పెడుతున్నాయి.
దారి తప్పుతున్న ఖాకీ
ఓ వైపు ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని అమలుచే స్తూ.. ఇటీవలే వీక్లీ ఆఫ్‌లను కూడా ప్రకటించింది. కానీ, డి పార్ట్‌మెంట్‌ పేరు చెప్పి ప్రజల్లో ఉన్న కాస్తా భయాన్ని కొం తమంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఖాకీ చొక్కాకు ఉన్న విలువను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. గత రెండు సంవత్సరాల కాలం నుంచి ఉమ్మడి నిజామాబా ద్‌ జిల్లాలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పలు ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురవు తూవచ్చారు. నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలో ఓ మహిళ హత్య కేసులో స్థానిక మండల పోలీసు అధికారులు అధికా ర పార్టీ నేతలకు కొమ్ముకాశారనే ఆరోపణలు ఎదుర్కొన్నా రు. ఈ సంఘటన రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. అదే సమయంలో కామారెడ్డి డివిజన్‌ పరిధిలో క్రికెట్‌ బెట్టిం గ్‌, అక్రమాస్తులు కూడపెడుతున్నారనే ఆరోపణలతో డీఎ స్పీ, సీఐ, మరో ఎస్సై జైలుపాలు కావడమే కాకుండా సస్పె న్షన్‌కు గురయ్యారు. ఇటీవల ఓ మర్డర్‌ కేసు విషయంలో డ బ్బులు ఇస్తే నిందితుని తప్పిస్తానంటూ వైరల్‌గా మారిన ఆడియో ఓ సీఐని సస్పెన్షన్‌కు గురిచేసింది. ఈ సంఘటన లు మరవకముందే గాంధారి ఘటన రాష్ట్రస్థాయిలో చర్చనీ యాంశంగా మారింది. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలోనే ఓ ఎస్‌ఐ స్థాయి అధికారి కిందిస్థాయి మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి గొంది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి సంఘటనలు పోలీసుశా ఖకే కాకుండా అందులో పనిచేసే నిజాయితీ అధికారులకు, సిబ్బందికి మచ్చ తెస్తున్నాయి.
కలకలం రేపిన గాంధారి ఘటన
నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి.. కామారెడ్డి జిల్లా పోలీ సు కార్యాలయంలో పనిచేస్తున్న ఏఆర్‌ మహిళా కానిస్టేబు ల్‌తో వివాహేతర సంబంధం కొనసాగించడంతో అదిచూసి.. తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గాంధారి మండలం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో సదరు ఎస్‌ఐతో పాటు మహిళా కానిస్టేబుల్‌పై గాం ధారి పోలీసు స్టేషన్‌లో 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశ మవుతోంది. శిక్షణ కాలంలోనే ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి మహి ళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, స దరు కానిస్టేబుల్‌ సైతం వేరే వ్యక్తితో వివాహం జరిగినా ఎస్‌ఐతో బంధం కొనసాగించడంపై పలు విమర్శలకు తావి స్తోంది. వీరీ వివాహేతర సంబంఽఽధం వల్ల ఒక నిండు ప్రా ణం బలి కాగా.. ఇద్దరు పిల్లలు ఆనాథలుగా మారారు. ఈ సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసు కున్నట్లు తెలిసింది. మహిళా కానిస్టేబుల్‌పై గాంధారి పోలీ సులు విచారణ చేస్తుండగా ఇందల్వాయి ఎస్‌ఐపై నిజామా బాద్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రాథమిక వి చారణ వివరాలను పోలీసు ఉన్న తాధికారులకు నివేదించి నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో వీరిద్దరినీ విధు ల్లో నుంచి తొలగించే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధి కారులు పేర్కొంటున్నారు.
వివాదాల సుడిగుండంలో ఎస్సై శివప్రసాద్‌రెడ్డి
ఎస్సై శివప్రసాద్‌రెడ్డి 2018 బ్యాచ్‌కు చెందిన వారు. 2019 డిసెంబరు నుంచి ఇందల్వాయి ఎస్‌ఐగా పనిచేస్తు న్నారు. ఈ ఎస్‌ఐపై మొదటి నుంచీ పలు వివాదాలు తలె త్తుతూనే ఉన్నాయి. ఇందల్వాయిలోనే మొదటి పోస్టింగ్‌ ప్రొ బేషనరీ సమయం కొనసాగుతున్న సమయంలోనే ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయని పోలీసు నిఘావర్గాలు చెబు తున్నాయి. పలు ఆరోపణలపై గతంలోనే నిఘా వర్గాలు పో లీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చే వారిపై దురుసుగా ప్రవర్తిస్తుండడం, ఏదైనా ఆశించిన తర్వాతనే పనిచేసేవాడని పలువురు ఫిర్యా దుదారులు ఆరోపిస్తున్నారు. భూ సెటిల్‌మెంట్‌లో ఎక్కువ గా తలదూర్చే వారంటూ విమర్శలు ఉన్నాయి. ఇందల్వాయి లోని ఓ భూతగదాల విషయంలో తలదూర్చి భారీ మొత్తం లోనే డిమాండ్‌ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ప్రొబేష నరీ సమయంలో నే సదరు ఎస్‌ఐ వివాదాస్పదంగా మారడంపై ఆయన పనితీరు ఎలా ఉందో అర్ధం చేసు కోవచ్చని పోలీసుశాఖ లో చర్చనీయాంశమైంది.
సెలవులో ఇందల్వాయి ఎస్‌ఐ
గాంధారి ఘటనతో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌ మధ్య సంబంధం వెలుగులోకి రాగా.. ఈ కేసు విషయంలో మహి ళా కానిస్టేబుల్‌ను కామారెడ్డి పోలీసులు అదుపులోకి తీసు కుని విచారణ చేపడుతున్నారు. అయితే, ఎస్‌ఐ శివప్రసాద్‌ రెడ్డిని నిజామాబాద్‌ పోలీసులు విచారిస్తున్నారు. బుధవా రం వరకు విధుల్లో ఉన్న సదరు ఎస్‌ఐగు రువారం నుంచి మూడు రోజులపాటు సెలవుల్లోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. సొంతశాఖలోనే కిందిస్థాయి మహిళా సిబ్బందితో వివాహే తర సంబంధం పెట్టుకోవడం, అది భరించలేక కానిస్టేబుల్‌ భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా తనను తొలగిస్తారనే ఆలోచనతో సదరు ఎస్‌ఐ సెలవుల్లోకి జారుకున్నట్టు సమా చారం. మరి వీరిపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోవేచి చూడాల్సిందే.

Updated Date - 2021-06-11T05:05:44+05:30 IST