ప్రజల నమ్మకాన్ని పోలీసులు నిలబెట్టుకోవాలి

ABN , First Publish Date - 2022-08-09T05:46:39+05:30 IST

పోలీసులు ప్రజల నమ్మకం నిలబెట్టుకోవాలంటే వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని జిల్లా ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ పోలీసుస్టేషన్‌ అధికారులను ఆదేశించారు.

ప్రజల నమ్మకాన్ని పోలీసులు నిలబెట్టుకోవాలి
మాట్లాడుతున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌

సమస్యలపై తక్షణం  స్పందించాలి : ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 8 : పోలీసులు ప్రజల నమ్మకం నిలబెట్టుకోవాలంటే వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని జిల్లా ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ పోలీసుస్టేషన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించి ఎస్పీ వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలు వినితక్షణ చర్యలకు ఆదేశిస్తూ పలు సూచనలు చేశారు. కేసులపై తక్షణం స్పందించడంతో పాటు ప్రజలతో మర్యాదగా మసలు కోవాలని అన్నారు. అదే రీతిలో ప్రజలు పోలీసులకు అసాంఘిక శక్తుల సమా చారం తెలియజేసి శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు. భారీవర్షాల కార ణంగా విషజ్వరాలు సోకే ప్రమాదముందని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అపరిచితులు, అనుమానితుల సమాచారం పోలీసులకు తెలియ జేసేందుకు వాట్సాప్‌ నెంబర్‌ 8333986939 ఉపయోగించుకోవాలన్నారు. సమీప పోలీసుస్టేషన్‌ అధికారులను సంప్రదించవచ్చునన్నారు. 

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

 పోలీస్‌ కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటామని జిల్లా పోలీసు అధికారి సీహెచ్‌.ప్రవీణ్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కరోనాసమయంలో బాధిత హోంగార్డ్‌ కుటుంబాలకు పోలీస్‌ సంక్షేమనిధి నుండి ఆర్థికసహాయం అందజేశారు. దేవోళ్ల శేఖర్‌, కే. కేశవ్‌ కుటుంబాలకు ఐదేసి వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్‌ ఆర్‌ఐ రామకృష్ణ, రమేష్‌, దేవరావు, తదితర హోంగార్డ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T05:46:39+05:30 IST