బీజేపీ విధానాలతో అడుక్కునే దుస్థితి

ABN , First Publish Date - 2022-05-25T05:04:49+05:30 IST

బీజేపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రాలు అడ్డుకోవాల్సిన పరిస్థితులు ఏర్ప డ్డాయని నేషనల్‌ ల్యాండ్‌ మౌనిటే షన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఎందు కు చేశారో కేంద్రం చెప్పాలని, గడప గడపకూ ప్రభుత్వం కార్య క్రమాన్ని ప్రజల చెంతకు చేర్చే నేతలు, కార్యకర్తలు ఐక్య ఉధ్యమా లు చేపట్టాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు.

బీజేపీ విధానాలతో అడుక్కునే దుస్థితి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌

‘గడప గడపకూ ప్రభుత్వం’ ప్రజల చెంతకు చేర్చాలి 

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌

రాయచోటిటౌన్‌, మే24: బీజేపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రాలు అడ్డుకోవాల్సిన పరిస్థితులు ఏర్ప డ్డాయని నేషనల్‌ ల్యాండ్‌ మౌనిటే షన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఎందు కు చేశారో కేంద్రం చెప్పాలని, గడప గడపకూ ప్రభుత్వం కార్య క్రమాన్ని ప్రజల చెంతకు చేర్చే నేతలు, కార్యకర్తలు ఐక్య ఉధ్యమా లు చేపట్టాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. మం గళవారం అన్నమయ్య జిల్లా కేంద్రం ఎన్జీఓ హోంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సి స్టు) అన్నమయ్య జిల్లా కమిటీ విస్తృత సమా వేశంలో ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ఫెడరల్‌ రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా పక్కన పెట్టి, బీజేపీ విధానాలతో రాష్ట్రాలు కేంద్రాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చి పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రాల స్వతంత్ర అభివృద్ధి విధానాన్ని కుంటుపరుస్తుందని వా రు విమర్శించారు.

మోదీ ప్రభుత్వం నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ భూమిని కారుచౌకగా విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలకు అమ్మడం వారి నుంచి పరోక్షంగా బీజేపీ ఎన్నికల నిధులు సమీకరిస్తారన్నారు. ప్రజలపై పన్నుల భారాలు వేసి పారిశ్రామిక వేత్తలకు ఉద్దీపన పథకాల కింద రుణమాఫీ చేస్తూ ప్రజల సొమ్మును పెద్దలకు ఇస్తున్నా రని ఆరోపించారు. సీపీఎం 23వ జాతీయ మహాసభలు ఏకగ్రీవ తీర్మానం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో బీజేపీ మోదీ ప్రభు త్వాన్ని దించి వామపక్ష, ప్రజా స్వామ్య ప్రత్యామ్నాయ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి కడప జిల్లా కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సవవేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్‌ రమాదేవి, కడప, చిత్తూరు జిల్లాల కార్యదర్శులు చంద్రశే ఖర్‌, గంగరాజు, కడప జిల్లా సీనియర్‌ నేత నారాయణ, అన్నమయ్య జిల్లా లోని రాజం పేట, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజక వర్గాల, మండ ల, పట్టణ, నగర కార్యదర్శులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా నూతన జిల్లా కమిటీ కార్యదర్శిగా శ్రీనివాసులు, కమిటీ సభ్యులుగా రామాంజనేయులు, వెంకట్రామయ్య, మెహ రున్నీషా, రాజేశ్వరిని ఎన్నుకున్నారు. 

Updated Date - 2022-05-25T05:04:49+05:30 IST