క్రీడా ప్రాంగణాన్ని నిలిపి వేయాలి

ABN , First Publish Date - 2022-06-30T04:55:40+05:30 IST

ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటును నిలిపివేయాలని కోరుతూ మండలంలోని ఆలంపల్లి గ్రామస్థులు బుధవారం తహసీల్దార్‌ రామకోటికి వినతిపత్రం అందజేశారు.

క్రీడా ప్రాంగణాన్ని నిలిపి వేయాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న లబ్ధిదారులు

కృష్ణ, జూన్‌ 29 : ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటును నిలిపివేయాలని కోరుతూ మండలంలోని ఆలంపల్లి గ్రామస్థులు బుధవారం తహసీల్దార్‌ రామకోటికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్లు 162/ఎ1, 163/ఎ1, 163/ఎ2, రెండెకరాల 24 గుంటల భూమిని 2003లో బెనకప్ప, సూగురప్ప, మారెప్ప నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి 57 మంది లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్‌ అందజేసింది. ప్రభుత్వం అందజేసిన స్థలంలో ఇప్పుడు క్రీడా ప్రాంగణం కోసం చేపట్టిన పనులు నిలిపివేయాలని వారు వినతిలో పేర్కొన్నారు. అంతకుముందు 57 మంది లబ్ధిదారులు క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు మండల పరిషత్‌ అధికా రులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించడంతో మండల పరిషత్‌ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో లబ్ధిదారులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు.

Updated Date - 2022-06-30T04:55:40+05:30 IST