రోడ్డు పక్కన స్నాక్స్ అమ్ముకుంటున్న ఈ యువతి ఎవరో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-06-24T01:27:59+05:30 IST

దల్జీత్ కౌర్.. అంతర్జాతీయ పారా ఎయిర్ పిస్టల్ షూటర్. ఇంటర్నేషనల్ పారా ఎయిర్ పిస్టల్ షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారత్ తరఫున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది.

రోడ్డు పక్కన స్నాక్స్ అమ్ముకుంటున్న ఈ యువతి ఎవరో తెలిస్తే..

దల్జీత్ కౌర్.. అంతర్జాతీయ పారా ఎయిర్ పిస్టల్ షూటర్. ఇంటర్నేషనల్ పారా ఎయిర్ పిస్టల్ షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారత్ తరఫున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో 24 బంగారు, 8 రజత, 3 కాంస్య పతకాలు దక్కించుకుంది. అంతటి ప్రతిభావంతురాలు ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా? డెహ్రాడూన్‌లోని గాంధీ పార్క్ వెలుపల రోడ్డు పక్కన స్నాక్స్ అమ్ముకుంటోంది. తన కుటుంబ సభ్యుల ఆకలి కష్టాలు తీర్చడం కోసం ఆమె చిరు వ్యాపారిగా మారిపోయింది. 


` పారా ఎయిర్ పిస్టల్ షూటింగ్‌‌లో నేను దేశాన్ని రిప్రజెంట్ చేశాను. అయినా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నాను. ఉత్తరాఖండ్‌లో క్రీడలకు ప్రాధాన్యం లేదు. ప్రభుత్వం తలచుకుంటే నాకు ఉద్యోగం ఇవ్వగలదు. అయినా నన్ను పట్టించుకోలేదు. నా ప్రతిభకు గుర్తింపు లేదు. ప్రస్తుతం నేను నా ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాను. ఆకలి కష్టాలు కూడా వెంటాడుతున్నాయి. అందుకే రోడ్డు పక్కన చిరుతిళ్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్నామ`ని దల్జీత్ చెప్పింది. 

Updated Date - 2021-06-24T01:27:59+05:30 IST