మొక్కలను సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T05:24:10+05:30 IST

వర్షాలు కురుస్తున్నందున త్వరలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కానున్న నాటడానికి మొక్కలను సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాజార్షిషా సూచించారు.

మొక్కలను సిద్ధం చేయాలి

నారాయణఖేడ్‌, జూన్‌ 21:  వర్షాలు కురుస్తున్నందున త్వరలో  హరితహారం కార్యక్రమం  ప్రారంభం కానున్న  నాటడానికి మొక్కలను సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాజార్షిషా సూచించారు. సోమవారం  మండల పరిధిలోని చాప్టా.కె గ్రామంలోని నర్సరీని  సందర్శించారు. గ్రామం పక్కన గల ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారనే ఆరోపణల మేరకు  ఆ స్థలాన్ని పరిశీలించారు. కాగా సోమవారం సాయంత్రం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నందున మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రత కోసం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

నాటిన ప్రతి మొక్కను బతికించాలి

కోహీర్‌: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైన ఉందని అడిషనల్‌ ఏపీడీ జయదేవ్‌ ఆర్య అన్నారు. గోటిగర్‌పల్లిలో ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను, నర్సరీలలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. 

కాశీంపూర్‌లో మెగా హరితవనం ఏర్పాటు

జహీరాబాద్‌: కాశీంపూర్‌లో మెగా హరితవనం ఏర్పాటు చేస్తున్నామని ఆర్డీవో రమే్‌షబాబు పేర్కొన్నారు.


Updated Date - 2021-06-22T05:24:10+05:30 IST