Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 27 Nov 2021 14:02:06 IST

జాదుగాడితో జాక్విలిన్ రొమాంటిక్ సెల్ఫీ... మోస్ట్ ఫేమస్ మోసగాడితో ఆమెకు లింకేంటి?

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఆమె వెనుకాల ఓ క్రిమినల్. అతడామె బుగ్గలపై ముద్దు పెడుతున్నాడు. అంతే కాదు, ఇద్దరూ చేతిలో సెల్‌ఫోన్‌తో మిర్రర్ సెల్ఫీ కూడా తీసుకున్నారు! ఇప్పుడు ఈ రొమాంటిక్ పిక్, తెగ వైరల్ అవుతోంది! కారణం... జాక్విలిన్‌తో ఉన్నది ఏ నటుడో, మరెవరో కాదు... అనేక పోలీసు కేసులు ఎదుర్కొంటోన్న నొటోరియస్ క్రిమినల్ సుఖేశ్ చంద్రశేఖర్!


అనేక మందిని నమ్మించి మోసం చేసిన చంద్రశేఖర్ కోట్లు కాజేశాడు. అతడిపై పలు చోట్ల అనేక కేసులున్నాయి. ఇప్పటికే తీహార్ జైల్లోనూ ఊచలు లెక్కపెట్టాడు. అటువంటి మోసగాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్విలిన్ గతంలోనే స్పష్టంగా పేర్కొంది. అయితే, తాజాగా అతడితో బాలీవుడ్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ బయటకు రావటం, అందులో ఇద్దరూ ముద్దుమురిపాల్లో కనిపించటం... బీ-టౌన్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పుడు బయటపడ్డ జాక్విలిన్, చంద్రశేఖర్ రొమాంటిక్ పిక్ 2021 ఏప్రెల్-జూన్ మధ్యలో తీసిందని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అప్పట్లో సుఖేశ్ చంద్రశేఖర్ మధ్యంతర బెయిలుపై బయట ఉన్నాడని కూడా అంటున్నారు.


గత అక్టోబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నుంచి జాక్విలిన్‌కి సమన్లు అందాయి. చంద్రశేఖర్ నడిపిన మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆమెకు సంబంధం ఉందని ప్రచారం జరిగింది. అదే సమయంలో తన క్లైంట్ చంద్రశేఖర్‌కి, జాక్విలిన్‌కి రొమాంటిక్ రిలేషన్ ఉందని నిందితుడి తరుఫు లాయర్ చెప్పటం చాలా మందిని షాక్‌కి గురి చేసింది. జాక్విలిన్ అధికార ప్రతినిధి అప్పట్లో ఆ వ్యాఖ్యల్ని ఖండించాడు. ఈడీ కేవలం సాక్షిగా మాత్రమే జాక్విలిన్‌ని పరిగణిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని విధాలుగా దర్యాప్తు సంస్థకు ఆమె సహకరిస్తోందని ప్రకటించాడు. చంద్రశేఖర్‌తోగానీ, అతడి భార్య లీనాతోగానీ ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు.


నిజానికి బాలాజీ అనే మరో పేరుతోనూ సుఖేశ్ చంద్రశేఖర్ చలామణి అయ్యాడు. ఉద్యోగాలు ఇప్పిస్తాననీ చెప్పి చాలా మందిని మోసం చేశాడు. ఓ టాప్ పొలిటీషన్‌కి తాను బంధువునని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా వంద మందికి పైగా నమ్మించి 75 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టాడు. అంతకంటే ముందే, 2011లో చంద్రశేఖర్ మరో కేసులో తన అప్పటి గాళ్ ఫ్రెండ్ లీనా మారియాతో కలసి అరెస్ట్ అయ్యాడు. కెనరా బ్యాంక్‌ని వారిద్దరూ మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన సుఖేశ్ చంద్రశేఖర్ తన పద్ధతులు మార్చుకోలేదు. మళ్లీ అనేక కేసుల్లో మరింత మందిని మోసం చేశాడు. బీజేపీ అగ్ర నాయకుల పేర్లు చెప్పి ఢిల్లీలోని ఓ సంపన్న మహిళ వద్ద నుంచి కూడా బలవంతంగా కోట్లాది రూపాయలు వసూలు చేశాడు.


2017లో... జయలలిత స్నేహితురాలు శశికళ బంధువైన టీటీవీ దినకరన్ తరుఫున ఎలక్షన్ కమీషన్ అధికారులకే చంద్రశేఖర్ లంచం ఇవ్వబోయాడు. ఆ కేసులో కూడా అతను తీహార్ జైల్లో ఉండి బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇన్ని రకాల క్రిమినల్ కేసుల్లో పేరున్న ఒక ఘరానా మోసగాడితో జాక్విలిన్ రొమాంటిక్ రిలేషన్ ఇఫ్పుడు పెద్దగా చర్చగా మారింది. పైకి ఆమె తనకు ఎలాంటి సంబంధం లేదని అంటోన్నప్పటికీ తాజా సెల్ఫీ మరోసారి కలకలం రేపుతోంది. చూడాలి మరి, ముందు ముందు ‘సాహో‘ బ్యూటీకి కోర్టుల్లో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...