గ్యాస్ డెలివరీ కోసం ఆర్మీ క్యాంప్‌లోకి తరచూ వచ్చే యువకుడిపై అనుమానం.. నిఘా వేసి అతడి ఫోన్‌ను చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2021-09-17T18:24:55+05:30 IST

అతను రాజస్థాన్‌లోని ఆర్మీ క్యాంప్ వెలుపల గ్యాస్ ఏజెన్సీని నడుపుతున్నాడు..

గ్యాస్ డెలివరీ కోసం ఆర్మీ క్యాంప్‌లోకి తరచూ వచ్చే యువకుడిపై అనుమానం.. నిఘా వేసి అతడి ఫోన్‌ను చెక్ చేస్తే..

అతను రాజస్థాన్‌లోని ఆర్మీ క్యాంప్ వెలుపల గ్యాస్ ఏజెన్సీని నడుపుతున్నాడు.. గ్యాస్ డెలివరీ నెపంతో తరచుగా ఆర్మీ క్యాంప్‌ లోపలికి వెళ్లేవాడు.. దీంతో మిలిటరీ అతడిపై నిఘా వేసింది.. అతడు ఆర్మీ క్యాంప్‌కు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఒక మహిళా ఏజెంట్‌కి పంపుతున్నట్టు అనుమానించింది.. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. రాజస్థాన్‌లోని నార్హద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి

అదే జరిగితే లీటర్ పెట్రోల్ ధర 57 రూపాయలు మాత్రమే..!



రెడ్ సిగ్నల్ పడగానే రోడ్డుపైకి దూసుకొచ్చి ఓ యువతి అనూహ్య చర్య.


నార్హాద్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్ వెలుపల సందీప్ (30) అనే వ్యక్తి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీని నడుపుతున్నాడు. గ్యాస్ డెలివరీ కోసం తరచుగా ఆర్మీ క్యాంప్ లోపలికి వెళ్లేవాడు. సందీప్ తరచుగా ఆర్మీ క్యాంప్ లోపలకు వస్తుండడంతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ అతడిపై నిఘా వేశాయి. అతను సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఒక మహిళా ఏజెంట్‌‌ను సంప్రదించినట్టు ఇంటెలిజెన్స్ విభాగాలు గుర్తించాయి. దీంతో అతడిని ఈ నెల 12న అదుపులోకి తీసుకున్నాయి. 


అతని ఐ ఫోన్ 7, సోషల్ మీడియా ఖాతాలను ఇంటెలిజెన్స్ విభాగాలు తనిఖీ చేస్తున్నాయి. ఈ విచారణలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అతడి ఖాతాలోకి ఇటీవల అనుమానాస్పదంగా రూ.10 వేలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ రూ.10 వేల విషయంలో సందీప్ చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేదట. దీంతో అతడిని జైపూర్‌కు విచారణ నిమిత్తం తరలించారు. 

Updated Date - 2021-09-17T18:24:55+05:30 IST