యోగాతో పరిపూర్ణ జీవితం

ABN , First Publish Date - 2021-06-22T06:28:27+05:30 IST

యోగా అనుష్టానం ద్వారా పరిపూర్ణమైన జీవి తం సిద్ధిస్తుందని వక్తలు పేర్కొన్నారు.

యోగాతో పరిపూర్ణ జీవితం
గుంతకల్లు రైల్వే ఇనస్టిట్యూట్‌లో యోగాసనాలు వేస్తున్న దృశ్యం

గుంతకల్లు, జూన 21: యోగా అనుష్టానం ద్వారా పరిపూర్ణమైన జీవి తం సిద్ధిస్తుందని వక్తలు పేర్కొన్నారు. స్థానిక రైల్వే ఇనస్టిట్యూట్‌ ఆవరణ లో పతంజలి యోగా పరివారం ఆధ్వర్యంలో రైల్వే ఉన్నత పాఠశాల హెచఎం మధుసూదన రావు అధ్యక్షతన సోమవారం యోగా దినోత్సవాన్ని ని ర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మోటారు వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాసులు మాట్లాడారు. యోగాను ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగంగా భావించాలన్నారు. దేశ శక్తితోపాటు ఆత్మశక్తి కూడా సాధ్యపడుతుందన్నారు. శరీరం, మనస్సు ఆధీనంలో ఉంటే జీవితం సుఖమయం కా వడమే కాకుండా అనుకున్నది సాధించగలరని పేర్కొన్నారు. యోగా గు రువు చింతా మునుస్వామి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా కష్ట పరిస్థితుల్లో యోగాభ్యాసం శరీర దృఢత్వాన్ని, మనోధైర్యాన్ని ఇస్తుందన్నారు. అనంత రం విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు అబ్బురపరిచాయి. కార్యక్రమంలో రైల్వే స్కూల్‌ హెచఎం మధుసూదనరావు, వైద్యుడు కాకర్ల ప్రకాశ, రైల్వే ఇనస్టిట్యూట్‌ కోశాధికారి గిరిమోహన పాల్గొన్నారు. స్థానిక శ్రీ శంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ప్రిన్సిపాల్‌ కే రామకృష్ణ నాయుడు మాట్లాడారు. విద్యార్థులు యోగా చేయ డం వల్ల మానసిక రుగ్మతలు తొలగిపోతాయన్నారు. అనంతరం విద్యార్థు ల చేత యోగాసానాలు చేయించారు. కార్యక్రమంలో ఎనఎ్‌సఎ్‌స ప్రోగ్రాం అధికారి కృష్ణయ్య, ఎనసీసీ లెప్టెనెంట్‌ అధికారి ప్రకాష్‌, అధ్యాపకులు గోపి, నటరాజ్‌, రాకేష్‌, తదితరులు పాల్గొన్నారు. ప్రధాన తపాలా కార్యాలయంలో ప్రత్యేకంగా రూపొందించిన యోగా డే రబ్బర్‌ స్టాప్‌ను విడుద ల చేశారు. కార్యక్రమంలో డివిజనపోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఆదినారాయ ణ, హెడ్‌ పోస్టాఫీస్‌ పోస్టుమాస్టర్‌ పరశురాముడు, సిబ్బంది పాల్గొన్నారు.   లయన్సక్లబ్‌ ఆధ్వర్యంలో చిన్న రంగన్నను సన్మానించారు. కార్యక్రమంలో  క్లబ్‌ అధ్యక్షుడు ధినేష్‌, కోశాధికారి సుదర్శన, రీజన చైర్మన ఇల్లూరి గోపాలకృష్ణ, ఓంకారప్ప, రవి, రమణ పాల్గొన్నారు.


గుత్తి: స్థానిక రైల్వే డీజిల్‌ షెడ్‌లో సోమవారం కార్మికులు, ఉద్యోగులు, అధికారులు యోగాసానాలు చేశారు. సీనియర్‌ డీఎంఈ రమేష్‌ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయాలన్నారు. 


ఉరవకొండ: పట్టణంలోని షిర్డీసాయి ఫంక్షన హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా గురువు వెంకట్‌ మాట్లాడారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఆయూర్‌సంస్థ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆనలైనలో విద్యార్థులకు యోగాసనాలు గురించి తెలియజేశారు. కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, ఆయూష్‌ వైద్యులు షఫీవుల్లా పాల్గొన్నారు. 


తాడిపత్రి : అంతర్జాతీయ యోగాడేను పురస్కరించుకొని పట్టణంలో సోమవారం కొత్తబ్రిడ్జి సమీపపార్కులో పలువురు యోగాసనాలు వేశారు.  ప్రతిఒక్కరు క్రమం తప్పకుండా యోగా చేయాలని వారు కోరారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో కూడా యోగా దినోత్సవం కొనసాగింది. 


కళ్యాణదుర్గం : యోగాతో మానసిక ఉల్లాసం కలుగుతుందని శ్రీసరస్వతీ విద్యామందిరం ప్రధానాచార్యులు తిరుమలరావు పేర్కొన్నారు. సోమవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయు్‌షశాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ ఆరోగ్యశాస్త్రం లో యోగా అంతర్భాగమన్నారు. కార్యక్రమంలో హోమియో డాక్టర్‌ లాల్యానాయక్‌, రామ్మోహనగుప్తా, షిరిడీనాథ్‌ పాల్గొన్నారు.


యాడికి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం యోగాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ యునాని వైద్యులు చిరంజీవి మాట్లాడుతూ క్రమం తప్పని యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ల భిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు ప్రవీణ్‌కుమార్‌, స్వైరోస్‌ సభ్యుడు రవికుమార్‌, ఎంపీహెచఓ శ్రీనివాసులు,యువకులు పాల్గొన్నారు. 


రాయదుర్గం రూరల్‌ : సంపూర్ణ ఆరోగ్యంగా బతకాలంటే ప్రతిమనిషి కి క్రమం తప్పని యోగా అవసరం ఎంతైనా వుందని పోస్టల్‌ అసిస్టెంట్‌ మురళి పేర్కొన్నారు. సోమవారం మల్లాపురంలో వెలసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పోస్టల్‌ సిబ్బందితో యోగాసనాలు వేయించారు. సంపూర్ణ ఆరోగ్యం, మేధోశక్తి తటస్థంగా వుండాలంటే యోగా చేయడమే మంచిదన్నారు. తప్పనిసరిగా యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:28:27+05:30 IST