గోదావరినది వంతెనపై గుంతలు పూడ్చిన ప్రజలు

ABN , First Publish Date - 2021-10-20T05:22:34+05:30 IST

అధికారులకు చెప్పినా ఎలాంటి ఉపయోగం లేకపోవటంతో సర్పంచ్‌, గ్రామ ప్రజలు ఏకమై శ్రమదానం చేసి గుంతలు పూడ్చారు. ఖానాపూర్‌ మండలం బాధనకుర్తి సమీపంలోని గోదావరి వంతెనపై పలుచోట్ల గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుచు న్నాయి.

గోదావరినది వంతెనపై గుంతలు పూడ్చిన ప్రజలు
శ్రమదానం చేస్తున్న మస్కాపూర్‌ ప్రజలు

ఖానాపూర్‌ రూరల్‌, అక్టోబర్‌ 19 : అధికారులకు చెప్పినా ఎలాంటి ఉపయోగం లేకపోవటంతో సర్పంచ్‌, గ్రామ ప్రజలు ఏకమై శ్రమదానం చేసి గుంతలు పూడ్చారు. ఖానాపూర్‌ మండలం బాధనకుర్తి సమీపంలోని గోదావరి వంతెనపై పలుచోట్ల గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుచు న్నాయి. సంబంధిత అధికారులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోక పోవటంతో సమీపంలోని మస్కాపూర్‌ సర్పంచ్‌ మహేం దర్‌, ఉప సర్పంచ్‌ దొనికెని సాగర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు దయానంద్‌లు, గ్రామ ప్రజలు కలిసి మంగళవారం శ్రమదానం నిర్వ హించారు. వంతెన పైన పెద్ద పెద్ద గుంతలను సిమెంట్‌, కాంక్రీట్‌తో పూడ్చారు. దీంతో రాకపోకలకు గుంతల వలన ఇబ్బందు తొలగి పోయాయి. గుంతలు ఏర్పడి దాదాపు సంవత్సరంకు పైగా అవు తుందని, అనేక ప్రమాదాలు జరిగాయని, ఆర్‌ అండ్‌ బీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, అధికారులతో చెప్పిన పలితం లేదని తామే శ్రమదానం నిర్వహించామని పలువురు అన్నారు. 

Updated Date - 2021-10-20T05:22:34+05:30 IST