ఆకతాయి చేష్టలతో జనం బెంబేలు

ABN , First Publish Date - 2022-07-04T06:01:58+05:30 IST

పట్టణంలో ఇటీవల ఆకతాయిల చే ష్టలు మితిమీరాయి. అంబేడ్కర్‌ సర్కిల్‌, వాల్మీకి సర్కిల్‌, హిందూపు రం రోడ్డు, రాజీవ్‌ గాంధీ సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు పది మంది ఆకతాయిలు పెట్రేగిపోతున్నట్లు స్థానికులు ఆందోళన చెందు తున్నారు.

ఆకతాయి చేష్టలతో జనం బెంబేలు
ఆకతాయిని పోలీస్‌ స్టేషనకు తరలిస్తున్న దృశ్యం

మడకశిర టౌన, జూలై 3: పట్టణంలో ఇటీవల ఆకతాయిల చే ష్టలు మితిమీరాయి. అంబేడ్కర్‌ సర్కిల్‌, వాల్మీకి సర్కిల్‌, హిందూపు రం రోడ్డు, రాజీవ్‌ గాంధీ సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు పది మంది ఆకతాయిలు పెట్రేగిపోతున్నట్లు స్థానికులు ఆందోళన చెందు తున్నారు. చాకుతో బెదిరిస్తూ సెల్‌ఫోన్లు లాకెళ్లుతున్నారన్న ఆరోపణ లున్నాయి. వృద్ధులు, మహిళలు, విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకొని..   ఫోన చేసి ఇస్తానంటూ చేతికి ఫోన ఇచ్చిన వెంటనే మాట్లాడుతూ కనుమరుగవుతున్నారు. ఇటీవల వరుస సంఘటనలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. విలాసాలకు బానిసై, ఆర్థిక అత్యవసరాల కోసం ఆకతాయిలు ఈ మార్గం ఎంచుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల బదిలీపై వెళ్లిన స ర్కిల్‌ఇనస్పెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేయడంతో, సెల్‌ఫోన్లు బెదిరించి లాకెళుతున్న అకతాయిలను పట్టుకొన్న సమయంలో మత్తు పదార్థాలు దొరికినట్లు సమాచారం. అ సమయంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిని వదిలేశారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఈక్రమంలో పట్టణంలో వారపు సంత జరిగే గురువారం సాయంత్రం సమయం లో బాటసారులు వెళ్లే సందర్భంలో ద్విచక్ర వాహనంలో అగంతకు లు వెంటపడి ఫోన్లు లాకెళుతున్నట్లు చెబుతున్నారు. తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి, టీడీపల్లి తండాకు చెందిన విద్యార్థి కర్ణాటకలో విద్యను అభ్యసిస్తూ గ్రామానికి వెళ్లేందుకు వాల్మీకి సర్కిల్‌లో దిగారు. ఆ వెంటనే అగంతకులు కత్తితో బెదిరించి సెల్‌ ఫోన  లాకెళ్ళడానికి యత్నించారు.


శనివారం సాయంత్రం ఆలయంలో కూ ర్చున్న వృద్ధుల వద్ద సెల్‌ఫోన ఇప్పించుకొని ఉడాయించాడు. సెల్‌ఫోనలను ఆకతాయిలు తమ విలాస జీవన అవసరాల కోసం తక్కువ ధరకు అమ్మి, వచ్చిన డబ్బుతో జల్సా చేస్తున్నారని తెలిసింది. బెదిరించిన ఆకతాయిలు కొందరిని నేరుగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు చేయడంతో రెండురోజుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా పోలీసులు గస్తీ నిర్వహించి ఆకతాయిల బెడద అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-07-04T06:01:58+05:30 IST