మహ్మద్‌ ప్రవక్త మార్గం అనుసరణీయం

ABN , First Publish Date - 2021-10-20T04:42:44+05:30 IST

సమస్త మానావళి సంక్షేమమే లక్ష్యంగా మహ్మద్‌ ప్రవక్త చేసిన బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

మహ్మద్‌ ప్రవక్త మార్గం అనుసరణీయం
గద్వాలలో మిలాద్‌-ఉన్‌-నబీ ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- ఘనంగా మిలాద్‌ -ఉన్‌ - నబీ

- గద్వాల, అలంపూర్‌లో ర్యాలీలు నిర్వహించిన ముస్లింలు

గద్వాల టౌన్‌, అక్టోబరు 19 :  సమస్త మానావళి సంక్షేమమే లక్ష్యంగా మహ్మద్‌ ప్రవక్త చేసిన బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. మహ్మద్‌ ప్రవక్త జన్మదినం  మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని మం గళవారం పట్టణంలోని నల్లకుంట ఉర్దూఘర్‌ కం షాదీ ఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొ ని మాట్లాడారు. ముస్లిం సోదరులకు  మిలాద్‌- ఉన్‌-నబీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రవక్త బోధనల సారాశాంన్ని నేటి తరానికి వివరించేందుకు మత పెద్దలు కృషి చేయాలన్నారు. కేసీఆర్‌ నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. షాదీము బారక్‌, మైనార్టీ నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేక గు రుకులాలు, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికి  ఆర్థిక సహాయం వంటివి ముస్లింల అభ్యున్నతి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైస్‌ చైర్మన్‌, బాబర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సంజీ వులు, కౌన్సిలర్లు నాగిరెడ్డి, శ్రీను, నాగరాజు, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మున్నాబాషా, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్య క్షుడు టి. గోవిందు, నాయకులు సర్వారెడ్డి, వంశీ, భాస్క ర్‌, యూత్‌సభ్యులు శ్రీకాంత్‌, అబ్బు, తదితరులున్నారు. అనంతరం షాదీఖానా నుంచి ఒంటెలపేట మస్జీద్‌ వరకు నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. 

 అలంపూర్‌ పట్టణంలో..

అలంపూరు : పట్టణంలో మిలాద్‌-ఉన్‌-నబీ వేడు కలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణం లో చిన్నారులు పలు కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు. ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా అలం పూరు ఎస్‌ఐ మధుసూదన్‌ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో మత పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. 

 గట్టులో..

గట్టు: అగ్గిపెట్టే కన్నా చిన్నసైజులో ఉండే 250ఏళ్లు నాటి  అరుదైన అతి చిన్న పురాతనమైన పవిత్ర ఖురాన్‌ గ్రంథాలకు మంగళవారం గట్టులోని జమియా మస్జిదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మీలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా గట్టులోని జామియ మస్జిదు, బిచ్చాలపేటలోని మస్జిదులోని అతి పురాతనమైన గ్రంథాలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహ్మద్‌ ప్రకవక్త జన్మదినం సందర్భంగానే  ఏడాది ఒకసారి మాత్రమే ఈ అతి చిన్న గ్రంథాలను బయటకు తీస్తారు.  ఇందులో మొత్తం 480 పేజీలు ....30 పర్వాలు ఉంటాయని  ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఇందులోని అక్షరాలను భూతద్దం ద్వారా చూస్తే తప్ప, ఇందులో ఇమిడి ఉన్న అక్షరాలు కంటికి కన్పించవు. ఈ గ్రంథాలు గట్టులో తప్ప మరేక్కడ లేవని ముస్లింలు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ముస్లింలు వచ్చి ఈ గ్రంథాలను దర్శించుకున్నారు. అనంతరం తిరిగి గ్రంథాలను యథాస్థానంలో భద్రపరిచారు.  





Updated Date - 2021-10-20T04:42:44+05:30 IST