దుప్పట్లో చుట్టి.. పక్కన ఓ వాటర్ బాటిల్ పెట్టి.. రెండేళ్ల చిన్నారిని రాత్రిపూట బస్టాండ్‌లో వదిలేశారు.. చివరకు..

ABN , First Publish Date - 2021-12-18T00:38:08+05:30 IST

మధ్యప్రదేశ్‌లో తల్లిదండ్రులు తమ రెండేళ్ల కొడుకును ఓ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ.. చిన్నారికి దుప్పటి కప్పి, పక్కన బిస్కట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్‌ను పెట్టి వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళితే...

దుప్పట్లో చుట్టి.. పక్కన ఓ వాటర్ బాటిల్ పెట్టి.. రెండేళ్ల చిన్నారిని రాత్రిపూట బస్టాండ్‌లో వదిలేశారు.. చివరకు..

జంతువులు కూడా తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాయి. పిల్లలను కనీసం ఒంటరిగా వదిలేందుకు కూడా ఇష్టపడవు. కానీ మనుషుల్లో మాత్రం మానవత్వం రోజురోజుకూ నశిస్తోంది. పిల్లలను హింసించడం, కొన్ని సందర్భాల్లో ఆఖరికి ప్రాణాలు కూడా తీయడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో తల్లిదండ్రులు తమ రెండేళ్ల కొడుకును ఓ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ.. చిన్నారికి దుప్పటి కప్పి, పక్కన బిస్కట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్‌ను పెట్టి వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ గ్వాలియర్ శివపురి ప్రాంతం, అమోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రేమ్ సిర్సౌద్ వద్ద ఉన్న బస్టాప్‌లో బుధవారం రాత్రి ఓ చిన్నారి ఏడుపులు వినిపించాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి దగ్గరికి వెళ్లి చూశారు. అక్కడ రెండేళ్ల పిల్లవాడు ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. పక్కనే బిస్కట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ ఉండడం చూసి ఖంగుతిన్నారు. సరిగా మాటలు కూడా రాని ఆ చిన్నారి.. ఒంటరిగా ఏడుస్తూ ఉండడం చూసి చలించిపోయారు. వెంటనే పోలీసులు, వైద్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వైద్యులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు.

వృద్ధురాలైన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి.. మత్తులోకి వెళ్లాక ఈ కొడుకు చేసిన నీచమిది.. ఏం జరిగిందో ఆలస్యంగా ఆమె గ్రహించి..


చిన్నారి పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి కారణంగా నడవడం, కూర్చోవడం చేయలేడని తెలిపారు. దీనికితోడు రక్తహీనత, పోషకాహార లోపం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. వంటిపై చిన్న చిన్న గాయాలు కూడా ఉండడంతో వైద్యులు చికిత్స చేశారు. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. కొడుక్కు వైద్యం చేయించలేక, ఇంట్లో ఉంచుకుని సపర్యలు చేయలేక.. ఇలా బస్టాండ్‌లో వదిలి వెళ్లుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారిని బాలల సంరక్షణ శాలకు తరలించనున్నట్లు పేర్కొన్నారు.

అదొక ఖరీదైన బంగళా.. లోపల కిచెన్‌ నుంచి సీక్రెట్ గదులకు ప్రత్యేక మార్గం.. మనసు బాలేనప్పుడల్లా ఆ యువతి అక్కడికే వెళ్తుందట..

Updated Date - 2021-12-18T00:38:08+05:30 IST