మోకాళ్ల నొప్పి మళ్లీ గుర్తుకు రాదు

ABN , First Publish Date - 2022-08-30T20:10:38+05:30 IST

ఇటీవలి కాలంలో ప్రతి చిన్న సమస్యకూ ఆపరేషన్‌ చేయించుకోవడం సర్వసాధారణమైపోయింది

మోకాళ్ల నొప్పి మళ్లీ గుర్తుకు రాదు

టీవలి కాలంలో ప్రతి చిన్న సమస్యకూ ఆపరేషన్‌ చేయించుకోవడం సర్వసాధారణమైపోయింది.  కానీ పుట్టుకతో వచ్చిన అవయవాలను కృత్రిమ అవయవాలతో భర్తీ చేసి, కాలం వెళ్లదీయం ఎంతవరకూ సమం జసం? చిన్న సూది మందుతో పరిష్కారం దక్కే వీలున్నప్పుడు, సర్జరీ వెంట పరుగులు తీయవలసిన అవసరం ఏముంది? సహజసిద్ధంగా మృదులాస్థి వృద్ధి చెందేలా చేసి, మోకాలి నొప్పిని దూరం చేసే చికిత్సా విధానం గురించి డాక్టర్‌ సుధీర్‌ దారా వివరిస్తున్నారు.


ప్లాస్మా చికిత్స ఎలా పని చేస్తుంది?

రక్తంలో ఉండే ప్లేట్‌లెట్‌ కణాలు చాలా చిన్నవి. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మోకీళ్లలో మృదులాస్థి దెబ్బతిన్నప్పుడు మోకాలి నొప్పులు మొదలవుతాయి. ఇలా దెబ్బతిన్న ప్రదేశంలోకి ప్లేట్‌లెట్లతో నిండిన ప్లాస్మాను ఇంజెక్ట్‌ చేస్తారు. దాంతో కొత్త కణజాలాన్ని ఉత్పత్తి చేసే కారకాలు ప్రేరేపితమవుతాయి. ఫలితంగా మొత్తం కణజాలం పునరుత్పత్తి చెందుతుంది.


లాభాలు ఇవే...

చికిత్స కేవలం 30 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇది మోకాళ్ల మార్పిడి లాంటి శస్త్రచికిత్స కాదు. చిన్న ఇంజెక్షన్‌తో కూడిన చికిత్స కాబట్టి నొప్పి, రక్తస్రావం ఉండదు. చికిత్స తర్వాత ఎటువంటి ఇబ్బందీ లేకుండా వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు, దుష్ప్రభావాల బాధలు ఉండవు. చికిత్స ప్రారంభం నుంచే నొప్పి తగ్గుముఖం పట్టి, ఎప్పటిలా పనులు చేసుకోవచ్చు. మోకాలి చికిత్సల్లో ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మాను మించిన సమర్థమైన విధానం మరొకటి ఉందని ఇంతవరకూ నిరూపితం కాలేదు. దీనికి బెడ్‌ రెస్ట్‌ అవసరం లేదు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఇది సహజమైన, సౌకర్యవంతమైన మార్గం. ఈ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన ఎపివన్‌ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌లో మోకాళ్లు, భుజాల నొప్పులకే కాకుండా నడుము నొప్పి, మైగ్రేన్‌ తలనొప్పి, స్పాండిలైటిస్‌, సయాటికా లాంటి అన్ని దీర్ఘకాలిక నొప్పులకూ ఆపరేషన్‌ అవసరం లేకుండా ఆధునిక చికిత్సలు లభిస్తాయి. 


అవార్డులు పొందిన ఆస్పత్రి

మోకీళ్ల ఆస్టియో ఆర్థ్రరైటిస్‌ నొప్పుల నివారణపరంగా అందిస్తున్న సేవలకుగాను, ఉ్కఐౖూఉ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి, ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కేర్‌ అవార్డు లభించింది. దక్షిణ భారతదేశంలో మోకీళ్ల ఆస్టియో ఆర్థ్రరైటిస్‌కు ఎక్కువ సంఖ్యలో నాన్‌ సర్జికల్‌ ప్లాస్మా థెరపీలను చేసినందుకు గాను ఆస్పత్రికి ఈ అవార్డును అందజేశారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర్‌ దారా గారికి క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అవార్డును అందజేశారు.


ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

అత్యధిక ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పిఇఆర్‌పి) చికిత్సలు చేసినందుకు గుర్తింపుగా, డాక్టర్‌ సుధీర్‌ దారాకు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, సర్టిఫికెట్‌ను ప్రదానం చేసింది. మోకాలి నొప్పి, భుజాల నొప్పి, యాంకిల్‌తో పాటు అన్ని రకాల ఇతర కీళ్లకు సంబంధించిన నొప్పులకు ఈ థెరపీతో చికిత్స చేయడం జరిగింది. 2018 అక్టోబరు నుంచి, 2022, ఫిబ్రవరి వరకూ డాక్టర్‌ సుధీర్‌ దారా, 3500 ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీలను విజయవంతంగా ముగించారు.


-డాక్టర్ సుధీర్ దారా

MD-BS, MD IAPM

సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ బియాండ్,

---------------------------------

ఫోర్త్ ఫ్లోర్, అపురూప పిసిహెచ్, రోడ్ నెంబరు 2, బంజారాహిల్స్, హైదరాబాద్-33

ఫోన్: 875-875-875-1, 

846-604-444-1



Updated Date - 2022-08-30T20:10:38+05:30 IST