ఫాదర్‌ ఫెర్రర్‌కు పద్మశ్రీ ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-06-20T06:30:53+05:30 IST

: మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి - ఫాదర్‌ ఫెర్రర్‌కు పలువురి ఘన నివాళి

ఫాదర్‌ ఫెర్రర్‌కు పద్మశ్రీ ప్రకటించాలి
ఫాదర్‌ఫెర్రర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 19: ఆర్డీటీ వ్యవ స్థాపకులు ఫాదర్‌ఫెర్రర్‌ సేవలను గుర్తించి పద్మశ్రీ అవా ర్డు ప్రకటించాలని అవే సంస్థ వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కోరారు. ఆయన శనివారం ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ వర్ధంతి సందర్భంగా స్థానిక క లెక్టరేట్‌ ఎదుట ఉన్న ఫెర్రర్‌ విగ్రహానికి అవే సంస్థ ఆఽ ద్వర్యంలో పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ కరవు జిల్లాలోని నిరు పేదలకు కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆ మానవతామూర్తిని దేశ చరిత్రలో పొందుపరిచేలా కేం ద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కోరారు. ప్రధాని మోదీని కలిసి విన్న విస్తామన్నారు. ఆయన 15వ వర్ధంతికి ఫాదర్‌ఫెర్రర్‌ జీవితచరిత్రను పుస్తక రూపంలో విడుదల చేస్తామని, ఆర్డీటీ చేస్తున్న సేవాకా ర్యక్రమాలు ప్రపంచానికి చాటిచెప్పేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అవే సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ రంగయ్య నివాళి : ఫాదర్‌ఫెర్రర్‌ విగ్రహానికి  ఎంపీ తలారి రంగయ్య పూలమాలలు వేసి నివాళి అ ర్పించారు. ఫాదర్‌ఫెర్రర్‌ కరవు జిల్లాకు చేసిన సేవలను  గుర్తుచేసుకున్నారు. ఆర్డీటీ చైర్మన తిప్పేస్వామి, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 మాజీ మంత్రి పరిటాల సునీత...

రామగిరి: ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ తన సేవలతో పేదల గుండెల్లో నిలిచిపోయారని మాజీ మంత్రి పరిటాలసునీత, తన యుడు పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. ఫాదర్‌ పెర్రర్‌ వర్ధంతిని పురస్క రించుకుని వారు వెంకటాపురంలోని తమ స్వగృహంలో ఫాదర్‌ ఫెర్రర్‌ చిత్ర పటం ఉంచి నివాళి అర్పించారు.  పేదరిక నిర్మూలనే ధ్యేయంగా భావించి జిల్లా రైతులకు ఉచిత వ్యవ సాయ పరికరాలు, విద్య, వైద్యం, అందించారని,  గూడు లేని అభాగ్యులకు లక్షల ఇళ్లను నిర్మించిన మహానుభావు డని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. 

ఆర్డీటీ ఆధ్వర్యంలో 1.25లక్షల మొక్కల పంపిణీ

అనంతపురం క్లాక్‌టవర్‌: ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో 1.25లక్షల మొక్కలు పంపిణీ చేశారు. స్థానిక ప్రధాన కార్యాలయంలో శనివా రం ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌, ప్రోగ్రాం డై రెక్టర్‌ మాంచోఫెర్రర్‌, హాస్పి టాలిటీ డైరెక్టర్‌ విశాలఫెర్రర్‌ తదితరులు ఫాదర్‌ ఫెర్రర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి, మొక్కల పంపిణీని ప్రారంభించా రు. ప్రతి గ్రామానికి మొక్కలు చేరాలని, ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ కలిగించాలని కోరారు. ఫాదర్‌ స్ఫూర్తితో ఆర్డీటీ సేవలను కొనసాగిస్తామన్నారు.

ఫాదర్‌ ఫెర్రర్‌ సేవలు చిరస్మరణీయం : ట్రైనీ కలెక్టర్‌  

రాప్తాడు: అనంతపురం జిల్లాలో పేదరిక నిర్మూలనకు ఫాదర్‌ఫెర్రర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని ట్రైనీ కలెక్టర్‌ సూర్యతేజ పేర్కొన్నారు. ఫాదర్‌ పెర్రర్‌ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం రాప్తాడులోని ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటి నీరుపోశారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉదయ్‌దీప్‌, ఎంపీడీఓ సాల్మనరాజ్‌, ఆర్డీటీ ఆర్డీ నారాయణ రెడ్డి, ఏటీఎల్‌ వరకుమార్‌, ఆటో నగర్‌ ప్రెసిడెంట్‌ షామీర్‌, శివారెడ్డి, గౌర వాధ్యక్షుడు భాషా, శంకర్‌, షేక్షావలి, షరీఫ్‌, అహ్మద్‌, బాబు, మస్తాన, ఆర్డీటీ సిబ్బంది నరసానాయుడు, నాగమణి, సుమలత, విశ్వప్రసాద్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 

 అలాగే  కలెక్టరేట్‌ ఎదుట ఆయన విగ్రహానికి మహాబోధిసాహిత్య వేదిక అధ్యక్షుడు దాసన్నగారి క్రిష్ణమూర్తి..., ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సాకే హరి తదితరులు, ఐఎంఎం ఆధ్వర్యంలో ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా తదితరులు, రిజర్వేషన ఎంప్లాయీస్‌ ఫె డరేషన(ఆర్‌ఈఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రామచంద్ర తదితరులు పూ లమాలలువేసి నివాళి అర్పించారు. 


Updated Date - 2021-06-20T06:30:53+05:30 IST