ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలి

ABN , First Publish Date - 2022-05-18T05:03:14+05:30 IST

జగనన్న హౌసింగ్‌ కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, దర్శి నియోజవర్గ ప్రత్యేకాధికారి జీవీ నారాయణరెడ్డి తెలిపారు.

ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలి
మాట్లాడుతున్న డీపీవో నారాయణరెడ్డి

డీపీవో నారాయణరెడ్డి

తాళ్లూరు, మే 17 : జగనన్న హౌసింగ్‌ కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, దర్శి నియోజవర్గ ప్రత్యేకాధికారి జీవీ నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీడీవో చాంబర్‌లో ఇళ్ల నిర్మాణాలపై  మండ లస్థాయి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.  గ్రామాల్లో  గృహ లబ్ధిదారులు జాబితాలను సిద్ధం చేయాలన్నారు. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే  చే యించాలన్నారు. ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపేవారు, చూపనివారి జాబి తాను సిద్ధం చేయాలన్నారు.  అవసరమైన వారికి వైకేపీ ద్వారా రుణసాయం అంది స్తామని చెప్పారు. ముందుకు రానివారికి అవగాహన కల్పించాలన్నారు. లేఅవుట్‌లో ఇల్లు కట్టుకునేందుకు నిరాకరించి  సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు వస్తే వారి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. అలాంటి వారికి ఇల్లు మం జూరుకు చర్యలు చేపట్టాలన్నారు.  తాళ్లూరులో 192 లబ్ధిదారుల్లో 175 మంది గృహా లు నిర్మించేందుకు జాబితాను సిద్దం చేసినట్లు తెలిపారు. 13 అమూల్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, నాలుగు మాత్రమే కొ నసాగుతున్నాయని అధికారులు డీపీవోకు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ స భ్యుడు వెంకటరెడ్డి, తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, ఎంపీడీవో కోటేశ్వరరావు,  హౌసింగ్‌ డీఈ వెంకటరమణ, ఏపీఎం దేవరాజ్‌, పశువైద్యుడు రాంబాబు, కోఆప్సన్‌ సభ్యుడు కరిముల్లా పాల్గొన్నారు. 

ముండ్లమూరులో..

ముండ్లమూరు :  ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం గృహ నిర్మాణాలపై డీపీవో సమీక్షించారు. రెండోవిడతలో మంజూరైన ఇళ్లు, లబ్ధిదారులు వెంటనే పనులు మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పురోగతి లేని వాటిపై గ్రామ కార్యదర్శులను ఆయన మందలించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావాలని, తడి చెత్తను వర్మీ కంపోస్టుగా తయారు చేసి స్థానికంగా ఉండే రైతులకు అమ్మడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలని ఆదేశించారు. రహదారికి ఇరువైపులా చెత్త దిబ్బలను తొలగించాలని, పరిశుభ్రత పాటించే విధంగా చూడాలన్నారు. పారిశుధ్య విషయంలో అలసత్వం వహిస్తే పంచాయతీ కార్యదర్శి, ఈవోఆర్‌డీలదే బాధ్యత అని తెలిపారు. ఇంటి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. 50 శాతం మించని కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో వీధి లైట్లు వెలిగే విధంగా చూడాలన్నారు. తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. అనంతరం మండలంలో వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట ఎంపీడీవో చంద్రశేఖరరావు, జేఈ హనుమంతరావు, ఈవోఆర్‌డీ ఓబులేసు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ చెన్నకేశవులు, మారెళ్ల సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-18T05:03:14+05:30 IST