కోట్ల రూపాయలు ఇస్తామన్నా ఈ గుర్రాన్ని అమ్మనని తేల్చేస్తున్న యజమాని.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-11-15T15:41:50+05:30 IST

రాజస్థాన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ పుష్కర్ ఫెయిర్‌కి..

కోట్ల రూపాయలు ఇస్తామన్నా ఈ గుర్రాన్ని అమ్మనని తేల్చేస్తున్న యజమాని.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే..

రాజస్థాన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ పుష్కర్ ఫెయిర్‌కి పంజాబ్‌లోని బఠిండా నుంచి వచ్చిన అల్బక్ష్ గుర్రం ధర చర్చాంశనీయంగా మారింది. అల్బక్ష్‌కు కోట్ల రూపాయల ఇస్తామన్నా.. దానిని విక్రయించేందుకు దాని యజమాని నిరాకరిస్తున్నారు. ఈ సందర్భంగా గుర్రం యజమాని మాట్లాడుతూ అల్బక్ష్‌ను పుష్కర్‌లో తిప్పేందుకు మాత్రమే తీసుకు వచ్చానని తెలిపారు. కాగా ఈ మేళాకు వచ్చినవారు అల్బక్ష్‌ను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 






అభిరుచికి వెల కట్టలేమని చెబుతుంటారు దీనిని పుష్కర్ మేళాకు వచ్చిన సందీప్ సింగ్ రుజువు చేశారు. ఆయన తన అల్బక్ష్ గుర్రాన్ని మేళాకు తీసుకువచ్చారు. ఈ గుర్రానికి ఎంత ధర ఇస్తామన్నా సందీప్ దానికి అమ్మేందుకు ఇష్టపడటం లేదు. ఈ గుర్రం తమ ఇంటిలోని సభ్యురాలివంటిదని సందీప్ తెలిపారు. తమ దగ్గర ఈ గుర్రంతో పాటు మరికొన్ని గుర్రాలు కూడా ఉన్నాయన్నారు. అయితే అల్బక్ష్ వాటిలో మేలిమి జాతికి చెందనదని అన్నారు. మూడేళ్ల క్రతమే దీనిని కొనుగోలు చేశానని, ఇది పేరెన్నకగన్న గుర్రాలలో ఒకటని తెలిపారు. దీని అందం, పొడవు, ఎత్తు కారణంగా ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నదన్నారు. అందుకే దీనిని ఇంత డిమాండ్ ఏర్పడిందన్నారు. ఇది మార్వాడీ ప్రజాతికి చెందిన గుర్రమని తెలిపారు. ఈ గుర్రాన్ని రాజుల కాలంలో యుద్ధాలలో వినియోగించేవారని, ఇవి ఎంతో వేగంగా పరిగెడతాయన్నారు. ఈ గుర్రం పరిరక్షణకు 24 గంటల పాటు ఉండేలా బాడీగార్డును నియమించామన్నారు. ఈ గుర్రానికి ఆహారం అందించేందుకు నెలకు 50 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. దీనికి తగిన ధర కట్టలేనని సందీప్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-15T15:41:50+05:30 IST