ఆదుకోవాలంటే అనాథలను చేశారు

ABN , First Publish Date - 2020-05-28T10:58:33+05:30 IST

ఉండడానికి ఇల్లు ఇచ్చి ఆదుకో వాలని వేడుకొన్న పేద కుటుంబానికి అధికార దాహం, లంచగొండితనంతో ముగ్గురు ఆడబిడ్డలు

ఆదుకోవాలంటే అనాథలను చేశారు

 తగిలేపల్లి ఘటనపై కాంగ్రెస్‌ ధ్వజం

 రూ.50 వేల ఆర్థిక సహాయం


వర్ని, మే 27: ఉండడానికి ఇల్లు ఇచ్చి ఆదుకో వాలని వేడుకొన్న పేద కుటుంబానికి అధికార దాహం, లంచగొండితనంతో ముగ్గురు ఆడబిడ్డలు అనాథలుగా మిగిలేలా చేశారని జహీరాబాద్‌ పార్ల మెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మద న్‌మోహన్‌రావు ఆందోళన వ్యక్తం చేశా రు. తగిలేపల్లి గ్రామంలో గోడకూలిన దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందిన ప్రాంతాన్ని బుధవారం ఆయన పరి శీలించారు. బాధిత కుటుంబానికి మద న్‌మోహన్‌ రావు, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ కన్వీనర్‌ యలమంచిలి శ్రీనివాస్‌రావు రూ.25వేల చొప్పున రూ.50వేలను సహాయంగా అందించా రు. గోడకూలిన ఘటనలో తల్లిదం డ్రులు, సోదరుడు ప్రాణాలు కోల్పోయి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మి గలడం అధికార పార్టీ నాయకుల నియంతృత్వ పో కడలకు నిదర్శనంగా మదన్‌మోహన్‌రావు ఆరోపిం చారు. డబుల్‌బెడ్‌రూం ఇల్లుకు రూ.20వేలు ఇవ్వ నందును స్థానిక నాయకులు మెడపట్టి బయటకు పంపేసిన పాపానికి ఓ కుటుంబం చిన్నాభిన్నం అయ్యిందని వాపోయారు.


ప్రభుత్వ ఫలాల కోసం ప్రశ్నించే పేదలను పోలీసులతో బెదిరించి తరిమి కొట్టే సంస్కృతి తగిలేపల్లిలో చోటు చేసుకుంటుం దని ధ్వజమెత్తారు. గత కాంగ్రెస్‌ పాలనలోనే ఆరె కరాల భూమి కొనుగోలు ఫలితమే ప్రస్తుత ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపునకు నిదర్శనంగా పేర్కొ న్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాఽథలుగా మిగిలిన ముగ్గురు ఆడబిడ్డలకు కాంగ్రెస్‌ పార్టీ అం డగా ఉంటుందన్నారు. వారి విద్యాభివృద్ధికి ప్రోత్సా హం అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమం లో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూని పూర్‌ రాజిరెడ్డి, ఎంపీటీసీలు బక్క నారాయణ, సా యిలు, చందూరు జడ్పీటీసీ అంబర్‌సింగ్‌, మాజీ జడ్పీటీసీ రంజ్యనాయక్‌, నాయకులు నేమాని వీర్రా జు, యేలేటి సురేష్‌, బెడద సాయన్న, కులకర్ణి సురేష్‌, రాంరెడ్డి, బానోత్‌రమేష్‌, ముజీబ్‌ తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T10:58:33+05:30 IST