గ్రంథాలయం ప్రారంభించడం అభినందనీయం

ABN , First Publish Date - 2022-10-03T04:53:06+05:30 IST

ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహకారంతో గ్రంథాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమని అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి అన్నారు.

గ్రంథాలయం ప్రారంభించడం అభినందనీయం
గ్రంథాలయాన్ని సందర్శిస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి

కెరమెరి, అక్టోబరు 2: ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహకారంతో గ్రంథాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమని అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి అన్నారు. ఆదివారం మండలంలోని సావర్‌ఖేడ గ్రామంలోని యూపీఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయు డిగా పనిచేస్తున్న రంగయ్య ఏర్పాటుచేసిన నాలుగు గ్రంథాల యాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పిల్లలను సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిపించడమే కాకుండా స్థానికంగా ఉంటూ గిరిజనుల విద్యాభివృద్ధికి పాటుపడడం ఎంతో గర్వించదగిన విషయమ న్నారు. ఉపాధ్యాయుడు రంగయ్య దేశానికి గర్వకారణమన్నారు. ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడు నివసిస్తున్న జిల్లాలో తాను పని చేయడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - 2022-10-03T04:53:06+05:30 IST