ఇరువర్గాలు రాజీకి రావడమే రాజమార్గం

ABN , First Publish Date - 2022-08-14T06:14:22+05:30 IST

ఇరువర్గాలు రాజీకి రావడమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మెన్‌ ఎన్‌. ప్రేమలత అన్నారు.

ఇరువర్గాలు రాజీకి రావడమే రాజమార్గం
మాట్లాడతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత

-523 కేసుల పరిష్కారం

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. ప్రేమలత

సిరిసిల్ల క్రైం, ఆగస్టు 13:  ఇరువర్గాలు రాజీకి రావడమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మెన్‌ ఎన్‌. ప్రేమలత అన్నారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ జిల్లాలో పెండింగ్‌ ఉన్న కేసుల్లో దాదాపు 523 కేసులు పరిష్కారం అయ్యాయని అన్నారు. ఇందుకు పలు కేసుల్లో రూ. 16.89 లక్షల చెల్లింపులు జరిగాయన్నారు. ఇందులో సిరిసిల్లలోని జిల్లా కోర్టులో 1, సబ్‌ కోర్టులో 1, పీడీఎం కోర్టులో 109, ఏడీఎం కోర్టులో 76, ఇతర 336 కేసులు పరిష్కారం అయ్యాయని ఆమె అన్నారు. రాజీ మార్గం ఉన్న క్రిమినల్‌, అన్ని సివిల్‌ కేసులకు లోక్‌ అదా లత్‌లో పరిష్కారం లభించిందన్నారు. భూ తగాదాలు, బ్యాంకు రుణాలు, కుటుం బ కలహాలు, తదితర కేసులలో లోక్‌ అదాలత్‌ ద్వారా సేవలు వినియోగించు కోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకుంటే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈ లోక్‌ అదాలత్‌లో ఇరువర్గాల్లోని కక్షిదారుల్లో ఎవరికైనా ఆర్థిక స్థోమత లేకపోయినా న్యాయసేవా సంస్థను సంప్రదిస్తే సేవలు అందిస్తుందన్నారు. ఒక సారి లోక్‌ అదాలత్‌లో కేసు పరిష్కారం అయితే అట్టి కేసులో ఏ కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్నారు. ప్రతి లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సౌజన్య, లోక్‌ అదాలత్‌ సభ్యులు చింతోజి భాస్కర్‌, పెంట శ్రీనివాస్‌, బార్‌ అసోసియేన్‌ అధ్యక్షులు వసంతం, కార్యదర్శి అనిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T06:14:22+05:30 IST