కేంద్ర పెత్తనంతో మిగిలేది జూరాలే

ABN , First Publish Date - 2022-06-26T04:49:32+05:30 IST

నదులపై కేంద్ర పెత్తనం వస్తే పాలమూరులో మిగిలేది జూరాల మాత్రమేనని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల ప్రాజెక్టులు మూసు కోవాల్సిందే అని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

కేంద్ర పెత్తనంతో మిగిలేది జూరాలే

గద్వాల, జూన్‌ 25: నదులపై కేంద్ర పెత్తనం వస్తే పాలమూరులో మిగిలేది జూరాల మాత్రమేనని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల ప్రాజెక్టులు మూసు కోవాల్సిందే అని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.  దీనిపై కేసీఆర్‌ ఎందుకు మౌనం పాటిస్తున్నాడు. ధాన్యం కొనుగోలు చేయలే దని ఢిల్లీలో ధర్నా చేసి నీళ్లపై ఎందుకు కొట్లాడటం లేదని కోదండరాం ప్రశ్నించా రు.  నడిగడ్డ పరిరక్షణ యాత్ర ముగింపు సభను శనివారం గద్వాలలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహ బూబ్‌నగర్‌లో అన్ని చోట్ల పోయిన ఎక్కడ కాలువల్లో నీళ్లు పారడం లేదన్నారు. ఆర్డీఎస్‌ ద్వారా చివరి ఆయకట్టుకు పారిన నీళ్లు నేడు పారడం లేదని ఆవేదన వ్వక్తం చేశారు. స్లూయిస్‌ల ద్వారా నీళ్లు కిందికి పోతున్నాయి... కాలువలు మరమ్మతు చేయలేదు.. ఆర్డీఎస్‌ ఎత్తు పెంచలేదని అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని మాటి చ్చావ్‌.. నీళ్లన్నింటీని ఆంధ్రాకు తీసుకపోతుంటే తెలంగాణ రైతుల పరిస్థి తిని చూడవా అని ప్రశ్నించారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో రిజర్వాయర్‌లు కట్టినా కాలువలు కట్టలేదు. తూములను ఏర్పాటు చేయలేదు, తుమ్మిళ్ల లో మూడు పంపుల్లో ఒక్కదానినే వాడుతున్నావు అన్ని అన్నారు. పాలమూరులో వలసలు ఆగిపోయాయని గొప్పలు చెప్పుకుంటున్నారు.. ఇక్కడ నుంచి బొంబాయి, హైదరాబాద్‌కు వలసలు పోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఎందుకు సాధించడం లేదని నిలదీశారు.  గద్వాలలో ఆసుపత్రి పేరు తో పేదల ప్లాట్లను గుంజుకున్నావు, వారికి డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఎప్పుడిస్తావని కేసీఆర్‌ ను ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో నీవు సాధించిం ది ప్రగతి భవన్‌ నిర్మాణం, సెక్రెటరీయేట్‌ నిర్మాణం తప్ప ఏమిలేదని అన్నారు. అంతకు ముందు పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి మాట్లాడారు. సహజవనరులను అందించినప్పుడే అభివృద్ధ్ది, ఉపాధి లభిస్తుందని, ఆ దిశగా కేసీఆర్‌ ఆలోచనలేదని అన్నారు.  జూ రాల నుంచి వందల టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నా పాలమూరు రైతుల భూములు మాత్రం ఎడారిగా మారాయని అన్నారు. సమా వేశంలో తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్‌ ప్రకాష్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ధర్మార్జున్‌, నాయకులు రామోహన్‌, తుల్జారెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T04:49:32+05:30 IST