ఇంటర్‌లో ఒకటే హాల్‌ టికెట్‌ నెంబరు!

ABN , First Publish Date - 2020-10-24T08:47:51+05:30 IST

ఇంటర్‌లో ఒకటే హాల్‌ టికెట్‌ నెంబరు!

ఇంటర్‌లో ఒకటే హాల్‌ టికెట్‌ నెంబరు!

హైదరాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ  సంత్సరాలకు కలిపి ఒకే హాల్‌ టికెట్‌ నెంబరు  ఉండేలా కసరత్తు చేస్తున్నామని ఇంటర్‌ విద్య కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఈసారి ఎంసెట్‌లో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా ఈ దిశగా ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 760 ప్రైవేటు కాలేజీలకు అనుమతులు జారీచేశామన్నారు. మరో 650 కాలేజీల విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ ఏడాది 20 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్‌ విద్యార్థులకు కానిస్టేబుల్‌ శిక్షణ ఇస్తున్నామని, దీనికి పోలీసుశాఖ సహకారం తీసుకుంటున్నామన్నారు. వివాదాస్పదమైన 30శాతం తగ్గించిన సిలబ్‌సపై మరో సబ్‌ కమిటీ వేశామని, తొలగించినవాటిలో చాలావరకు చేర్చామన్నారు. ప్రభుత్వ అనుమతి అందాక పాఠ్యాంశాలు విడుదల చేస్తామన్నారు. 

Updated Date - 2020-10-24T08:47:51+05:30 IST