Abn logo
Sep 24 2021 @ 00:04AM

జిల్లా ఆసుపత్రిలో ఒకే ల్యాబ్‌

రక్త పరీక్షల కేంద్రం వద్ద రద్దీగా ఉన్న దృశ్యం

- ఇబ్బందిపడుతున్న రోగులు 

- వెంటాడుతున్న కొవిడ్‌ భయం

టెక్కలి రూరల్‌ : స్థానిక జిల్లా ఆసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్షలకు ఒకే ల్యాబ్‌ ఉండడంతో బాధితులు ఇబ్బందిపడుతున్నారు. ప్రతి రోజూ వందాలాది మంది వివిధ అనారోగ్య సమస్యలపై  ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో ల్యాబ్‌కు రోగుల తాకిడి పెరుగుతోంది. గతంలో రెండు ల్యాబ్‌లు ఉండేవి... కొవిడ్‌ దృష్ట్యా ఒకదాన్ని కొరోనా నిర్థారణ పరీక్షలకు కేటాయించారు. దీంతో సాధారణ రోగులు ఇబ్బందిపడుతున్నారు. ఇకే ల్యాబ్‌ ఉండడంతో ఫలితాలు కూడా ఆలస్యంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ పొంచివున్న నేపథ్యంలో ల్యాబ్‌ వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కణితి కేశవరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా... కొవిడ్‌ ఆసుపత్రిగా ఉన్న సమయంలో ఒక ల్యాబ్‌ను కొరోనా నిర్ధారణ పరీక్షలకు కేటాయించామని, ఓపీ విభాగాల వద్ద ఉన్న ల్యాబ్‌లో ప్రస్తుతం పరీక్షలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుత సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.