కేంద్రీకృత విద్యతోనే ప్రయోజనం

ABN , First Publish Date - 2020-12-06T05:26:04+05:30 IST

కేంద్రీకృత విద్య తోనే విద్యార్థులకు ప్రయోజ నమని అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ తెలిపారు. వర్సిటీలో శనివా రం డిగ్రీ కోర్సుల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సమావేశం నిర్వహించారు.

కేంద్రీకృత విద్యతోనే ప్రయోజనం
సమావేశంలో మాట్లాడుతున్న వీసీ రాంజీ

ఎచ్చెర్ల: కేంద్రీకృత విద్య తోనే విద్యార్థులకు ప్రయోజ నమని  అంబేడ్కర్‌  వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ తెలిపారు. వర్సిటీలో శనివా రం డిగ్రీ కోర్సుల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లా డుతూ, విద్యార్థి అవసరాలను గుర్తించి సిలబస్‌ను రూపొందించాలన్నారు. ‘2015-16 విద్యా సంవత్స రం నుంచి ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌)ను అమలు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.రఘుబాబు, డీన్‌ అకడమిక్‌ ప్రొఫెసర్‌ టి.కామరాజు, సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, పాలకమం డలి సభ్యురాలు సురేఖ, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-06T05:26:04+05:30 IST