ఇచ్చిన పింఛను వెనక్కు.. గుండె ఆగి వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2021-10-19T08:15:30+05:30 IST

ఎనిమిదేళ్లుగా వస్తున్న వృద్ధాప్య పింఛను ఆగింది. అష్ట కష్టాలు పడి మళ్లీ ధ్రువపత్రాలు సమర్పించడంతో మళ్లీ మంజూరైంది. కానీ.. రెండు గంటల తర్వాత ఇచ్చిన పెన్షన్‌ మళ్లీ వెనక్కు తీసుకోవడంతో మనోవేదనకు గురై

ఇచ్చిన పింఛను వెనక్కు.. గుండె ఆగి వృద్ధురాలు మృతి

నిమ్మనపల్లె, అక్టోబరు 18: ఎనిమిదేళ్లుగా వస్తున్న వృద్ధాప్య పింఛను ఆగింది. అష్ట కష్టాలు పడి మళ్లీ ధ్రువపత్రాలు సమర్పించడంతో మళ్లీ మంజూరైంది. కానీ.. రెండు గంటల తర్వాత ఇచ్చిన పెన్షన్‌ మళ్లీ వెనక్కు తీసుకోవడంతో మనోవేదనకు గురై గుండె ఆగి మరణించింది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం గొల్లపల్లెకు చెందిన జంగిటి రెడ్డెమ్మ (80)కు వృద్ధాప్య పింఛను అందుతోంది. అయితే 2 నెలల క్రితం ఆమెకు పింఛను తొలగించారు. ఆమె మనవడు మహేశ్‌ పింఛనుకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు సమర్పించడంతో అక్టోబరు పింఛనుతో పాటు గతనెల పింఛను కూడా మంజూరైంది. వలంటీర్‌ గుర్రమ్మ.. ఆదివారం ఆమెకు రూ.4500 అందజేసింది. ఆ తర్వాత సచివాలయానికెళ్లిన వలంటీరుకు అక్కడి సిబ్బంది రెడ్డెమ్మ వేలిముద్రలు సరిపోలలేదని చెప్పారు. దీంతో రెండు గంటల తర్వాత ఆ వలంటీర్‌ వచ్చి ఇచ్చిన పింఛను సొమ్మును తీసుకెళ్లిపోయింది. దీంతో మనోవేదనకు గురైన రెడ్డెమ్మ ఆదివారం రాత్రి గుండె ఆగి మరణించింది.

Updated Date - 2021-10-19T08:15:30+05:30 IST