- జుట్టు ఆరోగ్యంగా, షైనీగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...
రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె పట్టించాలి. నూనె మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. జుట్టు మృదువుగా, షైనీగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా నూనె జుట్టుకు మంచి ఆహారం కూడా. అలాగే నూనె పెట్టుకోవడానికి మంచి సమయం కూడా ఇదే. ఒకవేళ మీకు నూనె పెట్టుకోవడం ఇష్టం లేకపోతే హెయిర్ సీరంను ఎంచుకోవచ్చు. జుట్టు పొడవుగా ఉన్నట్లయితే ముస్లిన్ క్లాత్‌తో చుట్టి దగ్గరకు కట్టాలి. దీనివల్ల జుట్టుచివర్లు పగిలిపోకుండా ఉంటాయి.