కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య పెంచాలి

ABN , First Publish Date - 2021-04-22T04:54:02+05:30 IST

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ టెస్టులను పెంచాలని అదనపు కలెక్టర్‌ రాజేశం అన్నారు.

కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య పెంచాలి
ఆస్పత్రిని తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్‌ రాజేశం

- అదనపు కలెక్టర్‌ రాజేశం

బెజ్జూరు, ఏప్రిల్‌ 21: కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ టెస్టులను పెంచాలని అదనపు కలెక్టర్‌ రాజేశం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథ మిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కొవిడ్‌టెస్ట్‌లను ఎంతవరకు చేస్తున్నారన్న విషయంపై అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ పనులు కొనసాగుతున్న ప్రదేశంలోనే కూలీలకు కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, లేని వారికి జరిమానాలు విధించాలన్నారు. టీకాపై అపోహలు పెట్టుకోవద్దని, 45 సంవత్స రాలు నిండిన వారందరూ టీకాలు వేసుకోవాలన్నారు. ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నిషియన్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వైద్యాధికారి తెలపడంతో కలెక్టర్‌ దృష్టికి తీసుకు పోతానని అన్నారు. అనంతరం డీఆర్‌డిపోలో ప్రైవేటు ఉపాధ్యాయులకు 25కిలోల బియ్యంను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ జమీర్‌, ఎంపీడీవో రాజేందర్‌, ఎంపీవో రమేష్‌రెడ్డి, సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌, కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T04:54:02+05:30 IST