ఫ్లోరిడాలో ఆరు లక్షలకు చేరువైన కేసులు

ABN , First Publish Date - 2020-08-23T07:35:06+05:30 IST

ఫ్లోరిడాలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువైంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు

ఫ్లోరిడాలో ఆరు లక్షలకు చేరువైన కేసులు

ఆర్లాండో: ఫ్లోరిడాలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువైంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలో మాత్రమే ఆరు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఫ్లోరిడా కూడా చేరబోతోంది. ఫ్లోరిడాలో శనివారం 4,311 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,97,597కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్, మే నెలల్లో న్యూయార్క్ రాష్ట్రంలో అత్యధిక కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాగా.. ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. ఫ్లోరిడాలో జూలై 12న 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక రాష్ట్రం నుంచి ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం అదే మొదటిసారి. ఇక ఆ తర్వాత ఫ్లోరిడాలో నెమ్మదిగా కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ప్రస్తుతం 4 వేలకు అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసుల సంఖ్య మరింత తగ్గాల్సిన అవసరం ఉందని.. రాష్ట్రంలో ఐసీయూ బెడ్స్ కొరత ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా.. ఫ్లోరిడాలో ఇప్పటివరకు 10,274 మంది కరోనా కారణంగా మరణించారు. 

Updated Date - 2020-08-23T07:35:06+05:30 IST