నిను వీడని నీడను నేనే..

ABN , First Publish Date - 2020-06-06T10:18:21+05:30 IST

నెల రోజులుగా స్తబ్ధుగా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు మహబూబ్‌నగర్‌ జిల్లాలో వారం రోజుల నుంచి

నిను వీడని నీడను నేనే..

పాలమూరును పీడిస్తున్న కరోనా

ఐదు రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్య

శుక్రవారం మరో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ

అమిస్తాపూర్‌లో తల్లీ కుమారుడికి, పాలమూరులో ఒకరికి పాజిటివ్‌

పగిడ్యాల, చెంగిచెర్ల గ్రామాల్లోనూ వ్యాపించిన వైరస్‌

జూన్‌ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు పది మంది బాధితులు

కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడిన అధికారులు

కంటైన్మెంట్‌లోకి ప్రభావిత ప్రాంతాలు


మాయదారి కరోనా మహబూబ్‌నగర్‌ జిల్లాను వీడటం లేదు.. వైరస్‌ ప్రారంభమైన మొదట్లో కొన్ని కేసులు నమోదైనా, అప్రమత్తత చర్యలతో కట్టడిలోకి వచ్చింది.. లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం జూన్‌ మొదటి వారం నుంచి మళ్లీ జిల్లాలో కలకలం రేపుతోంది.. ఐదు రోజుల వ్యవధిలో పది మందిపై పంజా విసిరింది.. ఇందులో ఒకే కుటుంబంలోని కొడుకుకు, ఆ తరువాత అతని తల్లికి, తాజాగా అతని భార్యా కుమారుడికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తున్నది.. పల్లెలకు కూడా వైరస్‌ వ్యాపించడంతో గండీడ్‌ మండలం పగిడ్యాల, బాలానగర్‌ మండలం చెంగిచెర్లలో ఒకొక్క కేసు చొప్పున నమోదు కాగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో కేసు నమోదు అయ్యింది.. దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ ప్రభావిత ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్‌లోకి తీసుకొచి, ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడింది..


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం): నెల రోజులుగా స్తబ్ధుగా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు మహబూబ్‌నగర్‌ జిల్లాలో వారం రోజుల నుంచి పెరుగుతున్నాయి. తాజాగా ఒకే రోజు జిల్లా లో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో జిల్లా కేంద్రంలోని ర వీంద్రనగర్‌లో ఒకరు, భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌ గ్రామంలో తల్లీ కొడుకులకు, గండీడ్‌ మండలం పగిడ్యాల గ్రామంలో ఒకరు, బాలానగర్‌ మండలం చెంగిచెర్లలో ఒకరు చొప్పున ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అమిస్తాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మొదట పాజిటివ్‌ అని తే లింది. ఆ తర్వాత తల్లికి సోకింది. శుక్రవారం అతని భార్య, కు మారుడికి కూడా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది.


అలాగే ఇది వరకు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో పని చే స్తున్న ఓ ఎంఎన్‌వోకు పాజిటివ్‌ రాగా, తాజాగా అదే ఆసుపత్రి లోని ఆరోగ్యశ్రీ విభాగంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తు న్న ఓ మహిళ పాజిటివ్‌ బారిన పడింది. అయితే అది ఎవరి నుంచి ఎలా సోకిందో తెలియడం లేదు. ఇదిలా ఉండగా పట్టణా లకే పరిమితమైన వైరస్‌ ఇప్పుడు గ్రామాలకు కూడా వ్యాపిస్తోం ది. ముందుగా హన్వాడ మండలం వేపూర్‌ గ్రామంలోని ఓ వ్య క్తికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత తాజాగా గండీడ్‌ మం డలం పగిడ్యాల గ్రామానికి చెందిన ఓ గుండె జబ్బుతో బాధపడు తున్న వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈమె గత 20 రోజులుగా ని మ్స్‌ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది.


అక్కడ ఆసుపత్రిలో ఆమెకు వై ద్యసేవలందించిన డాక్టర్‌కు కూడా పాజిటివ్‌ అని తేలింది. అంతేకాకుండా బాలానగర్‌ మండలం చెంగిచెర్ల గ్రామంలోని ఓ వృద్ధుడికి కూడా కరోనా అ ని నిర్ధారించారు. ఇతను కూడా 45 రోజులుగా హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనుమానం వచ్చిన వైద్యులు అతనికి పరీక్ష చేయగా కరోనా అని తేల్చారు.


జూన్‌ మొదటి వారం మళ్లీ కేసులు

జిల్లాలో లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 21 ఉన్నాయి. గత ఏప్రిల్‌ నెల నుంచి మే వరకు 11 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల రోజుల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జూన్‌ నెల ఆరంభం నుంచి మళ్లీ ఒక్కొక్కటిగా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఐ దు రోజుల్లోనే మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. అయితే అధికారులు క రోనాను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా, రోజుకు కేసుల సం ఖ్య పెరుగుతూనే ఉన్నది. కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ కింద తీసుకొని నివారణ చర్యలు చేపడుతున్నారు.



Updated Date - 2020-06-06T10:18:21+05:30 IST