రంజాన సందడి

ABN , First Publish Date - 2022-04-30T05:30:00+05:30 IST

రంజాన పురస్కరించుకొని దుకాణాలు కళకళళాడుతున్నాయి.

రంజాన సందడి

  1. దుకాణాల వద్ద అత్తర్‌ గుభాళింపులు
  2. నమాజ్‌ టోపీలు, ఖురాన పుస్తకాలు, దుస్తులకు గిరాకీ
  3. పాత నగరంలో జోరందుకున్న అమ్మకాలు  

కర్నూలు(కల్చరల్‌), ఏప్రిల్‌ 29: రంజాన పురస్కరించుకొని దుకాణాలు కళకళళాడుతున్నాయి. పండగ సమీపండంతో ముస్లింలు వివిధ రకాల కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఈ మాసంలో అత్తర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొత్త దుస్తులు ధరించి, సుగంఽధ పరిమళాలు వెదజల్లే అత్తర్ల గుభాళింపుతోనే ఈద్గాలకు వెళ్తారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అత్తర్ల విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్య పండుగలు, పెళ్లిళ్ల సీజనలో అత్తర్లు, పెర్‌ఫ్యూమ్‌లకు గిరాకీ ఎక్కువగా ఉన్నా రంజాన మాసంలో మాత్రం వివిధ రకాల అత్తర్లకు అత్యధికంగా డిమాండ్‌ ఉంటుంది. హైదరాబాదు సంస్కృతికి దగ్గరగా ఉండే పాతనగరంలో అత్తర్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 

 ఎన్నెన్నో వర్ణాలు...మరెన్నో పరిమళాలు... 

అత్తర్‌, పెర్‌ఫ్యూమ్‌లలో స్వచ్ఛమైన పువ్వులు, గంధపు చెక్కలు వంటివి ఉపయోగించి తయారు చేస్తుంటారు. వీటిలో జన్నతుల్‌, ఫిరదోస్‌, మజ్మా, షాజహాన, తమన్నా, నాయబ్‌, బకూర్‌, మెకల్లత, ఖస్‌, జాఫ్రాన తదితర రకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఆల్కాహాలు లేని అత్తర్లను ఎంపిక చేసుకోవడంలో ముస్లింలు ఆసక్తి చూపిస్తున్నారు. అసలైన అత్తర్లు ఉపయోగించే వారి దుస్తులు కూడా రెండు మూడు పర్యాయాలు ఉతికినా వాటి వాసన అలాగే ఉంటూ పరిమళాలు వెదజల్లుతుంటాయి. 

ఫ అందుబాటులో ఈద్‌ టోపీలు, ఖురాన పుస్తకాలు...

పండుగ రోజున కొత్త దుస్తులతోపాటు నమాజ్‌లకు హాజరయ్యే విభిన్న రకాల టోపీలను ఎంపిక చేసుకోవడంలో ముస్లిం యువకులు ఉత్సాహం చూపుతున్నారు. వీటిలో తెలుపు రంగుతోపాటు విభిన్న వర్ణాల్లో టోపీలు అందుబాటులో ఉన్నాయి. ఈ టోపీలను కాటన, పాలిస్టర్‌ వసా్త్రలతో పాటు, లేసు అల్లికలతో రూపొందించారు. ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఆకర్షణీయంగా కనిపించే వాటిపై యువత దృష్టి సారిస్తున్నారు. 

  దుస్తుల కొనుగోళ్ల సందడి...

ముస్లింలు దుస్తుల కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకించి లాల్చీ, పైజామా, వాటిపై వాష్‌కోట్‌ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. కాటన, టెర్రీకాటన, పాలిస్టర్‌, లెనిన కాటన వంటి వస్త్రంతో రెడీమేడ్‌గా తయారైనవి మార్కెట్లో ఆకట్టుకుంటున్నాయి. వీటికి ప్రత్యేక ఎంబ్రాయిడరీ డిజైన్లతోపాటు కొత్త రకంగా వివిధ డిజైన్లతో కూడిన జేబులు, బటన్లు ఆకర్షణీయంగా కుట్టినవి వ్యాపారులు అమ్మకాలు చేస్తున్నారు. 

  పెరిగిన ధరలతో తగ్గిన వ్యాపారాలు

- మహమ్మద్‌ యూసుఫ్‌, వ్యాపారి, కర్నూలు

ప్రస్తుతం నిత్యావసర వస్తువులతోపాటు సుగంధ ద్రవాల ధరలు పెరిగాయి. ఒకవైపు తీవ్ర ఎండలు, మరోవైపు పెరిగిన ధరలతో ఈ ఏడాది వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కరోనా వల్ల రెండేళ్లుగా వ్యాపారాలు లేని వారికి ఈ ఏడాది బాగుంటుందని ఊహించాం. కానీ ధరలు పెరిగిపోవడంతో కొనుగోళ్లు పెద్దగా లేవు. స్వల్ప లాభాలతోనే అమ్మకాలు చేయాల్సి వస్తోంది.    






Updated Date - 2022-04-30T05:30:00+05:30 IST