ఆలయాల్లో భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-02-28T04:23:37+05:30 IST

దులగుట్టపై శివశ్రీనివాసుల కల్యాణ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొ క్కులు తీర్చుకున్నారు.

ఆలయాల్లో భక్తుల సందడి
ముప్కాల్‌లో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు

ముప్కాల్‌, ఫిబ్రవరి27: దులగుట్టపై శివశ్రీనివాసుల కల్యాణ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొ క్కులు తీర్చుకున్నారు. 

పాలెంలో వైభవంగా బ్రహ్మంగారి జాతర

మోర్తాడ్‌ : పాలెంలో శనివారం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో జా తర కొనసాగింది. హోమం, పల్లకి సేవ, శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు తొగిట శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఏనుగు సంతోష్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ పలిగిరి రవి పాల్గొన్నారు.

ఇందల్‌వాయి: చంద్రాయన్‌పల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం ప్రారంభమైంది. ఉదయం పుణ్యవాచనం, నవగ్ర హాల పూజ, కుంకుమార్చనలు చేసి హోమం నిర్వహించారు. రాత్రి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

కమ్మర్‌పల్లి: శ్రీగిరి గుట్టపై వీర బ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సవం శని వారం నిర్వహించారు. ఆలయ అర్చకులు నూనె విశ్వనాథంచారి ఆధ్వ ర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజ, కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా చేయగా, ప్రజలు తిలకించారు. రాత్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి స్వామివారి రథోత్సవాన్ని ఊరేగించారు.

మల్లన్నకు నైవేద్యాల సమర్పణ

బాల్కొండ: బాల్కొండ, బోదేపల్లి, నాగాపూర్‌, బస్సాపూర్‌, ఇత్వార్‌పేట్‌ గ్రామాల్లో మల్లన్నకు భక్తులు శనివారం నైవేద్యాలు సమర్పించారు. ఉత్స వాలు ఘనంగా నిర్వహించారు. 

మామిడిపల్లిలో..

ఆర్మూర్‌టౌన్‌: మామిడిపల్లిలో ముజిగే మల్లన్న జాతర శనివారం నిర్వహించారు. భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మున్సిపల్‌చైర్‌పర్సన్‌ వినిత ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌ న్సిలర్లు సంగీత రవిగౌడ్‌, కోనపత్రి కవిత పాల్గొన్నారు. 

లింబాద్రిగుట్టపై భక్తుల సందడి 

భీమ్‌గల్‌: లింబాద్రిగుట్టపై శనివారం పౌర్ణమి సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ, అన్న దాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. 

గన్నారంలో నక్కలగుట్ట శివాలయం జాతర

ఇందల్‌వాయి: గన్నారం గ్రామంలో నక్కలగుట్ట శివాలయం జాతర ప్రారంభమైంది. శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భ క్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నల్లగుట్ట నరసింహస్వామి ఉత్సవాలు

ధర్పల్లి: దుబ్బాక అటవీ ప్రాంతంలో వెలసిన నల్లగుట్ట నరసింహస్వా మి ఉత్సవాలు శనివారం కొనసాగాయి. ధర్పల్లి, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, భీంగల్‌ మండలాల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, ఎంపీపీ సారికారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

కొప్పర్తి క్యాంప్‌లో తిరుపతమ్మ కల్యాణ మహోత్సవం

బోధన్‌రూరల్‌: కొప్పర్తిక్యాంప్‌ గ్రామంలో తిరుపతమ్మ ఆలయంలో శ నివారం కల్యాణ మహోత్సవం జరిగింది. వేదపండితులు ప్రత్యేక పూజ లు చేశారు. సాయంత్రం రథం ఊరేగింపు నిర్వహించారు.

తొర్లికొండలో వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు

జక్రాన్‌పల్లి: తొర్లికొండలో వేంకటేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా శనివారం భక్తులు స్వామివారి పల్లకితో పాటు కొండపై చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొ లిప్యాక్‌లో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ రథోత్సవం, జాతర ని ర్వహించా రు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ కిషన్‌నాయక్‌ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. 

హుస్సేన్‌నగర్‌, రావుట్లలో జాతర 

సిరికొండ: హుస్సేన్‌నగర్‌, రావుట్ల గ్రామాల్లో రథోత్సవాలు కన్నుల పం డువగా నిర్వహించారు. భక్తుల ఉదయం నుంచి ఆలయాల వద్ద క్యూలో ఉన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. 

ఘనంగా చక్రతీర్థం

డిచ్‌పల్లి: ఖిల్లా డిచ్‌పల్లి రామాలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం చక్రతీర్థం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చ కులు ఆదిత్యశర్మ ఆధ్వర్యంలో నిత్యహోమం, పూర్ణాహుతి, వనవిహారం, చక్రతీర్థం, గజవాహనసేవా వంటి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అంతకముందు సీతారామస్వామి సుప్రభాతం, స్వామివారి అభిషేకం చేశారు. ప్రజ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల స్టాల్స్‌ ఏ ర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రామ్‌దాస్‌గుప్తా, సర్పంచ్‌ రాధాకృష్ణారెడ్డి, విండోచైర్మన్‌ జైపాల్‌, ఆలయ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు వినోద్‌, హరికిషన్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T04:23:37+05:30 IST