రాబోయేది రైతు రాజ్యమే

ABN , First Publish Date - 2022-05-22T05:41:59+05:30 IST

రాబోయేది రైతు రాజ్యమే

రాబోయేది రైతు రాజ్యమే
షాబాద్‌: మాట్లాడుతున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి

  • టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి 
  • కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో ‘రచ్చబండ’


షాబాద్‌/ఇబ్రహీంపట్నం/కొత్తూర్‌/శంషాబాద్‌ రూరల్‌/కడ్తాల్‌/తలకొండపల్లి, మే 21: కాంగ్రెస్‌ పార్టీతోనే రైతు రాజ్యం సాధ్యమవుతుందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని యెల్గోండగూడలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అధికాంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, భూమిఉన్న రైతులతోపాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15వేలు, భూమిలేని ఉపాధిహామి కూలీలకు ప్రతి ఏడాదికి రూ.15వేలు, ధరణి పోర్టల్‌ రద్దు చేసి కొత్త రెవెన్యూ వ్యవస్థ, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు రాజ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కావలి చంద్రశేఖర్‌, సర్పంచ్‌ ప్రతా్‌పరెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, నాయకులు రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహులు ఉన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని రాయపోల్‌ గ్రామంలో టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వరి కొనుగోళ్లు కేంద్రాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు డిక్లరేషన్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మర్రి నిరంజన్‌రెడ్డి, బ్లాక్‌కాంగ్రేస్‌ అధ్యక్షులు శంకర్‌గౌడ్‌తో పాటు కాంగ్రేస్‌ పార్టి నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్‌లో పార్టీ షాద్‌నగర్‌ నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌  సిద్దాపూర్‌, శేరిగూడబద్రాయపల్లి గ్రామాల్లో ఎస్‌బీ పల్లి సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌, సిద్దాపూర్‌ శేఖర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, డాకి, చంద్రపాల్‌రెడ్డి, కుమారస్వామిగౌడ్‌, నాయకులు యాదయ్యయాదవ్‌, బాబర్‌ఖాన్‌, జిల్లెల రాంరెడ్డి, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా శంషాబాద్‌ మండలంలోని కవ్వగూడలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జి జ్ఞానేశ్వర్‌యాదవ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో మాట్లాడారు.  కార్యక్రమంలో టీసీసీ మెంబర్‌ వేణుగౌడ్‌, సానెం, ఫాసిం బాయ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జల్‌పల్లి నరేందర్‌, సంజయ్‌యాదవ్‌, జాంగీర్‌పాషా, సులోచన తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల మండలం అన్మా్‌సపల్లిలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలోరచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రైతు డిక్లరేషన్‌కు సంబందించి రూపొందించని కరపత్రాలు గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేశారు.   తలకొండపల్లిలోని లింగరావుపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ మండల అద్యక్షుడు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంబించారు. కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు యాదయ్య, శేఖర్‌, రమేశ్‌, రాములు, రవీందర్‌, తిరుపతి, అజీం, నరేశ్‌, రమేశ్‌ నాయక్‌, శివలింగం, శ్రీరాములు, మున్సి, సాయినాథ్‌, చెన్నకేశవులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:41:59+05:30 IST