రాబోయేది ఈ-పాలసీల శకమే

ABN , First Publish Date - 2020-09-12T06:28:26+05:30 IST

దేశంలో ఎలక్ర్టానిక్‌ బీమా పాలసీల శకం జోరందుకోబోతోంది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీల ఈ- పాలసీలు జారీ చేయడానికి ఐఆర్‌డీఏఐ అనుమతించింది.

రాబోయేది ఈ-పాలసీల శకమే

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ర్టానిక్‌ బీమా పాలసీల శకం జోరందుకోబోతోంది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీల ఈ- పాలసీలు జారీ చేయడానికి ఐఆర్‌డీఏఐ అనుమతించింది. రాబోయే రోజుల్లో ఇవే అధిక సంఖ్యలో జారీ కానున్నాయని అసోచామ్‌ నిర్వహించిన  కార్యక్రమంలో ఐఆర్‌డీఏఐ సభ్యురాలు (నాన్‌ లైఫ్‌) టీఎల్‌ అలమేలు తెలిపారు. అయినా బీమా కంపెనీలు, పాలసీదారుల కోసం ఐఆర్‌డీఏఐ చేయాల్సింది ఇంకా ఎంతో ఉన్నదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన మార్పులు ఆరోగ్యబీమా రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆమె చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని వ్యక్తుల మధ్య భౌతిక దూరం కాపాడేందుకు ఈ-పాలసీల జారీకి అనుమతి ఇచ్చామన్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల చేపట్టిన చర్యల వల్ల ఈ ఏడాది మార్చి-జూన్‌ మధ్య కాలంలోనే బీమా మార్కెట్‌ వృద్ధిరేటు 27 శాతం నుంచి 30 శాతానికి పెరిగిందన్నారు. 

Updated Date - 2020-09-12T06:28:26+05:30 IST