‘కొత్త’ సారథులు వచ్చేశారు

ABN , First Publish Date - 2022-04-03T08:15:46+05:30 IST

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలు ఖరారయ్యారు. శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

‘కొత్త’ సారథులు వచ్చేశారు

  • జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం
  • భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ


అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలు ఖరారయ్యారు. శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కూర్పులో భాగంగా భారీగా ఐఏఎస్‌, ఐపీఎ్‌సలను బదిలీ చేసింది. కొందరు కలెక్టర్లు, ఎస్పీలను మాత్రం పాత జిల్లాల్లో యథాతథంగా కొనసాగించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులకు తాజాగా కలెక్టర్‌ పోస్టులు దక్కాయి. పలు చోట్ల నగర కమిషనర్లుగా, ఇతర బాధ్యతల్లో  పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులకు కలెక్టర్‌ హోదా దక్కింది. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలకు ఇప్పటివరకు కలెక్టర్లుగా ఉన్న నివాస్‌, వివేక్‌ యాదవ్‌, హరికిరణ్‌లకు కలెక్టర్లుగా అవకాశం ఇవ్వలేదు. వీరిలో కొందరికి పైస్థాయిలో కీలక పోస్టింగ్‌లు దక్కే అవకాశాలున్నాయని సమాచారం. 


జాయింట్‌ కలెక్టర్లు వీరే...

శ్రీకాకుళం - ఎం.విజయ సునీత, విజయనగరం-కె.మయూర్‌ అశోక్‌; పార్వతీపురం మన్యం-ఒ.ఆనంద్‌, విశాఖపట్నం-కె.ఎ్‌స.విశ్వనాథన్‌, అల్లూరి సీతారామరాజు-జీఎ్‌స.ధనుంజయ్‌, అనకాపల్లి-కల్పనా కుమారి, కాకినాడ-ఇలాకియ, తూర్పు గోదావరి-ఎం.అభిషేక్‌ కిషోర్‌, కోనసీమ-ధ్యాన్‌చంద్ర, పశ్చిమ గోదావ రి-ఎం.అభిషిక్త్‌ కిషోర్‌; ఏలూరు-పి.అరుణ్‌బాబు, కృష్ణా-మహే్‌షకుమార్‌ రావిరాల, ఎన్టీఆర్‌-నూపుర్‌ అజయ్‌కుమార్‌, గుంటూరు-జి.రాజకుమారి, పల్నాడు-ఎ.శ్యామ్‌ప్రసాద్‌, బాపట్ల-కె.శ్రీనివాసులు, ప్రకాశం-జె.వెంకటమురళి, ఎస్‌పీఎ్‌సఆర్‌ నెల్లూరు-ఎం.ఎన్‌.హరీంద్రప్రసాద్‌, తిరుపతి-డికేబాలాజీ, చిత్తూరు-వెంకటేశ్వర్‌.ఎస్‌, అన్నమయ్య - ఎ.తమీమ్‌ అన్సారియా, వైఎస్సార్‌ కడప- సీఎం.సాయికాంత్‌ వర్మ, శ్రీ సత్యసాయి - కె.దినేష్‌ కుమార్‌; అనంతపురం - కేతన్‌ గార్గ్‌, నంద్యాల-నల్లపురెడ్డి మౌర్య, కర్నూలు-ఎ్‌స.రామసుందర్‌ రెడ్డి.


ఐపీఎస్‌ల బదిలీలు ఇలా: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మొత్తం 51 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీచేసింది. కొత్త జిల్లాలకు ఎస్పీల నియామకంతోపాటు డీఐజీలను కూడా బదిలీ చేసింది. ప్రస్తుతం విశాఖ కమిషనర్‌గా ఉన్న మనీశ్‌ కుమార్‌ సిన్హాను పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా నియమించింది. ఆ స్థానంలో ఉన్న హరీశ్‌ కుమార్‌ గుప్తాను రైల్వే డీజీగా బదిలీ చేసింది. శ్రీకాకుళం ఎస్పీగా ఉన్న అమిత్‌ బర్దార్‌ను సీఐడీ ఎస్పీగా నియమించింది. డి.నరసింహకిషోర్‌ను ఇంటిలిజెన్స్‌ నుంచి బదిలీ చేసి టిటిడి విజిలెన్స్‌కు బదిలీ చేశారు.  జెన్‌కో ఎస్పీగా టి.పననరెడ్డిని నియమించారు. విశాఖపట్నం రూరల్‌ ఎస్సీగా ఉన్న బి.కృష్ణారావును ఏసీబీలో ఎస్పీగా బదిలీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్న రాహుల్‌ దేవ్‌ శర్మను రైల్వేస్‌ ఎస్పీగా బదిలీ చేశారు. ఎస్‌ఈబీ కమిషనర్‌గా ఉన్న వినీత్‌ బ్రిజలాల్‌ను ఎస్‌ఐబీ ఐజీగా నియమించారు.



Updated Date - 2022-04-03T08:15:46+05:30 IST