Abn logo
Sep 24 2021 @ 00:53AM

దేశ వ్యాప్త బందును విజయవంతం చేయాలి

మాట్లాడుతున్న జువ్వాడి కృష్ణారావు

 కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల, సెప్టెంబరు 23 : ఈ నెల 27న నిర్వహిస్తున్న దేశ వ్యాప్త బం దును వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు సహకారం అందించి విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, దర్మపురి దే వాలయ కమిటీ మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. గురు వారం పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజావ్య తిరేక విధానాలు అవలంభిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను పైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సామాన్యుడికి అందే ని త్యావసర వస్తులు ధరలు నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్నారు. అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే దేశ వ్యాప్త బందు విజయవంతం చేయాలన్నారు. ఈ కా ర్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రాజం, తిరుమల గంగాధర్‌, మేకల నర్సయ్య, సత్యనారాయణ, శ్రీరాముల అమర్‌, సత్యనారాయణ, జాగిలం భాస్కర్‌, లక్ష్మణ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.