15 లక్షల ఇళ్లపై జాతీయ జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-11T06:39:20+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో పదిహేను లక్షల మంది బీజేపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేయడానికి ‘ఇంటింటికీ జెండా’ కార్యక్రమం చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. లాసన్స్‌ బే కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం ర్యాలీని ప్రారంభించారు.

15 లక్షల ఇళ్లపై జాతీయ జెండా రెపరెపలు
ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌, పార్టీ నగర అధ్యక్షులు ఎం.రవీంద్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో పదిహేను లక్షల మంది బీజేపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేయడానికి ‘ఇంటింటికీ జెండా’ కార్యక్రమం చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. లాసన్స్‌ బే కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండాలను ఎగురవేస్తామన్నారు. ప్రజల్లో జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. దేశంలో మొత్తం 20 కోట్ల ఇళ్లపై బీజేపీ నేతలు, కార్యకర్తలు జాతీయ జెండాను ఎగురవేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్‌రాజు, పార్టీ నగర అధ్యక్షులు ఎం.రవీంద్ర, ఇతర నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T06:39:20+05:30 IST