ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమం ఆగదు

ABN , First Publish Date - 2022-01-27T05:07:30+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు తీవ్ర అన్యాయం కలిగించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పీఆర్‌సీ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఉద్యమం ఆగదని జేఏ సీ నాయకులు హెచ్చరించా రు.

ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమం ఆగదు
రాయచోటిలో అంబేద్కర్‌ చిత్రపటానికి వినతి పత్రం అందజేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు

రాయచోటిటౌన్‌, జనవరి 26: ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు తీవ్ర అన్యాయం కలిగించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పీఆర్‌సీ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఉద్యమం ఆగదని జేఏ సీ నాయకులు హెచ్చరించా రు. బుధవారం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పట్టణంలోని పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్‌ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నేత లు వేణుగోపాల్‌రెడ్డి, హరిబాబు, జాబీర్‌, రెడ్డెప్పరెడ్డి, రవీంద్రనాధ్‌రెడ్డి పాల్గొన్నారు. 


పీఆర్‌సీ సాధన సమితి ఆందోళన 

రాజంపేట, జనవరి 26: రాజంపేట అంబేద్కర్‌ విగ్రహం ఎదుట పీఆర్‌సీ సాధన సమితి బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఎన్జీవో కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండు మీదుగా ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభు త్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయబద్ధమైన కోర్కెల్లో భాగంగా ఉద్యోగస్తులకు సముచితమైన పీఆర్‌సీని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఆర్‌సి సాధన సమితి చైర్మన్‌ వెంకటరమణ, హరిప్రసాద్‌, సుబ్రహ్మణ్యంరాజు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-27T05:07:30+05:30 IST