‘సీపీఎస్‌’ హామీ నెరవేర్చకుంటే ఉద్యమం తీవ్రతరం

ABN , First Publish Date - 2021-07-30T07:16:05+05:30 IST

‘తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్‌ అమలు చేస్తానని ప్రతిపక్షనేతగా జగన్‌ ఇచ్చిన హామీని సీఎంగా ఇప్పుడు నెరవేర్చాలి.

‘సీపీఎస్‌’ హామీ నెరవేర్చకుంటే ఉద్యమం తీవ్రతరం
సమావేశంలో మాట్లాడుతున్న యూటీఎఫ్‌ గౌరవాధ్యక్షుడు బాబురెడ్డి

యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బాబురెడ్డి హెచ్చరిక 


తిరుపతి(విద్య), జూలై 29: ‘తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్‌ అమలు చేస్తానని ప్రతిపక్షనేతగా జగన్‌ ఇచ్చిన హామీని సీఎంగా ఇప్పుడు నెరవేర్చాలి. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం’ అని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.బాబురెడ్డి హెచ్చరించారు. తిరుపతిలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో గురువారం తిరుపతి, శ్రీకాళహస్తి మండలాలకు చెందిన కార్యవర్గాల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 6వ తేదీన అన్ని మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ పీఆర్‌సీ, డీఏలు ఇవ్వకపోవడం బాధాకరమని జిల్లాప్రధానకార్యదర్శి జీవీ రమణ పేర్కొన్నారు. 3, 4, 5 తరగతులను ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని జిల్లా సహాధ్యక్షుడు కేఎస్‌బీ సూర్యప్రకాశ్‌ డిమాండు చేశారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.ముత్యాలరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు బండి మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ నాయుడు, శ్రీనివాసులు, దామోదర్‌శెట్టి, శేఖర్‌, జయంతి, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-30T07:16:05+05:30 IST