స్వాతంత్య్ర స్మృతి చిహ్నం....ఆ శిలాఫలకం

ABN , First Publish Date - 2022-08-13T04:32:45+05:30 IST

ఒకప్పుడు సమితీ కార్యాలయం... ప్రస్తుత మదనపల్లె మండల పరిషత్తు కార్యాలయంలో అప్పటి స్వాతంత్య్ర పోరాటయోధులకు చిహ్నంగా శిలాఫల కాన్ని ఆవిష్కరించారు.

స్వాతంత్య్ర స్మృతి చిహ్నం....ఆ శిలాఫలకం
సమరయోధుల చిహ్నంగా ఆవిష్కరించిన శిలాఫలకం

మదనపల్లె, ఆగస్టు 12: ఒకప్పుడు సమితీ కార్యాలయం... ప్రస్తుత మదనపల్లె మండల పరిషత్తు కార్యాలయంలో అప్పటి స్వాతంత్య్ర పోరాటయోధులకు చిహ్నంగా శిలాఫల కాన్ని ఆవిష్కరించారు. ఆంగ్లేయుల చెర నుంచి భరతమాతకు విముక్తి లభించిన పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా 1972 ఆగస్టు 15 నుంచి 1973 ఆగస్టు 14వరకు భారత సంవిధానము ఆఽధ్వర్యంలో స్థాపించారు. మదనపల్లె పంచాయతీ సమితిలోని వి.రామచంద్రారెడ్డి, నూతిరాధాకృష్ణయ్య, పి.సుబ్రహ్మణ్యం, సీఎస్‌ బాలగురునాథగుప్త, టీసీ సుబ్బారావు, కె.మల్‌రెడ్డి, కె.నరసింహారెడ్డి, వెంకటేశయ్య, టి.కన్నయ్యలు పేర్లు ఉన్నాయి. భారతదేశ పౌరులమైన మేము, దేశసార్వభూమిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుటకు, అందులో పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము, భావము, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన-వీటి స్వాతంత్య్రములోనూ, అంతస్థులోనూ, అవకాశములోనే, సమానత్వమును చేరుకూర్చుటకు కట్టుబడి ఉన్నామని తీర్మానించారు. అలాగే వ్యక్తి గౌరమును, రాష్ట్ర ఐక్యతను తప్పకుండా ఒనగూర్చు సౌభ్రాత్రమును పెంపొందించుటకు నిష్ఠాపూర్వకంగా తీర్మానించి, 1949 నవంబరు 26వ తేదీ మా సంవిధానసభలో అంగీకరించి, దాన్నే నియమముగా చేసుకుని మాకు మేము నిర్ణయించుకున్నామని సంయుక్తంగా శిలాఫలకంపై లిఖించారు.

Updated Date - 2022-08-13T04:32:45+05:30 IST