వానాకాలం సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2022-06-26T05:56:12+05:30 IST

ప్రస్తుత వానాకాలం వ్యవసాయ సీజన్‌లో జిల్లాలో ఎరువుల కొరత రాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలిన కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

వానాకాలం సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా చూడాలి
సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి నాయక్‌

కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వానాకాలం వ్యవసాయ సీజన్‌లో జిల్లాలో ఎరువుల కొరత రాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలిన కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. శనివారం పట్ట ణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, సం బంధిత అధికారులతో జిల్లా ఎరువుల మానిటరింగ్‌ కమిటీచే ప్రత్యేక స మీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో రైతుల అవసరం మేరకు ఎరువులను సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో ఎరువుల అవసరం, లభ్యత సంబంధిత వివరాలను పరిశీలిం చా రు. జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించి వారు ముం దుగానే డబ్బు కడితే ఎరువులు సరాఫరా చేయాలని, బ్యాంకు గ్యారెంటీ తో సైతం చేసుకోవాలని సూచించారు. ఎరువుల నిల్వలకు అవసరమైన గోదాములను గుర్తించాలన్నారు. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో యూరియా ఎరువు 37,630 మెట్రిక్‌ టన్నుల అవసరం కాగా 10, 716 మెట్రిక్‌ టన్నులు లభ్యత ఉందని, డీఏపీ 12,300 మెట్రిక్‌ టన్నులు అవసరం కా గా ప్రస్తుతం 1,931 మెట్రిక్‌ టన్నులు లభ్యత ఉందని, మిశ్రమ ఎరువులు 47,680 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా 2,150 లభ్యత ఉందని అధికా రులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్‌ కుమార్‌, జిల్లా సహకార సంఘాల అధికారి రామానుజా చారి, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ దివ్య భారతి, అర్బన్‌ అగ్రికల్చరల్‌ అధికారి, ఫర్టిలైజర్‌ రేక్‌ పాయిట్‌ అధికారిణి వినీల, అగ్రోస్‌ సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ మధు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T05:56:12+05:30 IST