Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎరువులు విక్రయించిన సొమ్ము బ్యాంక్‌లలో జమచేయాలి

జేడీఏ  విజయభారతి 


బాపట్ల: రైతుభరోసా కేంద్రాల ద్వారా విక్రయించే ఎరువులకు సంబంధించి న డబ్బులు ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమచేయాలని జేడీఏ ఎం.విజయభారతి తెలిపారు. బాపట్ల మార్కెట్‌ యార్డులో శనివారం సాయంత్రం సబ్‌ డివిజన్‌లోని నాలుగు మండలాల వ్యవసాయాధికారులు, రైతులతో ఆమె సమీక్ష నిర్వ హించారు. సమావేశంలో జేడీఏ మాట్లాడుతూ ఎరువులు విక్రయించిన డబ్బులు రోజుల కొద్ది మీ దగ్గర ఉంచుకోవటం వల్ల వచ్చే సీజన్‌కు కంపెనీలవారు ఎరువు లు పంపలేరన్నారు. కాబట్టి నిర్లక్ష్యం చేయక సకాలంలో డబ్బులు జమచేయాలని హెచ్చరించారు. ఈ విషయంలో వ్యవసాయాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. క్రాప్‌బుకింగ్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. కౌలురైతులకు రుణా లు ఇప్పించాలని చెప్పారు. మండలాల వారీగా కమ్యూనిటి హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేయాలని చెప్పారు.  క్రాప్‌ ఇన్సూరెన్స్‌ విషయమై చర్చించారు. కార్యక్రమంలో ఏడీఏలు ఎ.లక్ష్మీ, హేమలత, రవికుమార్‌, వ్యవసాయాధికారులు కె.శారద, అరవిందకుమార్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement