పెట్టుబడిదారులకు తొత్తుగా మోదీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-09-26T10:46:50+05:30 IST

The Modi government is a beacon for investors

పెట్టుబడిదారులకు తొత్తుగా మోదీ ప్రభుత్వం

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 25: కార్మిక, ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొ రేట్‌ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్న నరేం ద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు తొత్తు గా మారిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించా రు. వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వా రా నరేంద్ర మోదీ తన నిజ స్వరూపం బట్ట బయలైందని అన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శనివారం అఖిల భారత కిసాన్‌ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, టీజేఎస్‌, ఇతర రైతు, ప్రజా సంఘాలతో కలిసి పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమావేశంలో డీసీసీ అద్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు వెంకటస్వామి, ఆంజనేయు లు, టీజేఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఆలూరు ప్రకాష్‌ గౌ డ్‌, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర కోశాధికారి శంకర ప్రభాకర్‌, తెలంగాణ రైతాంగ సమితి నాయకుడు కృష్ణయ్య పాల్గొన్నారు. 


ఆర్డినెన్స్‌లను వెనక్కి తిసుకోవాలి

గట్టు: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కర ణల పేరిట తీసుకవచ్చిన ఆర్డినెన్స్‌లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రం లో సీపీఎం జిల్లా నాయకుడు వీవీ నరసింహ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ చౌక్‌లో నిరసన కార్యక్ర మం జరిగింది. బిల్లులతో రైతాంగానికి అధిక నష్టం చేకూరుతుందని వారు అన్నారు. కార్యక్ర మంలో సీపీఎం జిల్లా మహిళా నాయకురాలు ఎ.నర్మద, కర్రెప్ప, ఖలిల్‌, నర్సింహులు, ఈరన్న, వెంకటేష్‌, జయన్న పాల్గొన్నారు.


ఆర్డినెన్సులను రద్దు చేయాలి

రాజోలి: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవే శపెట్టిన భారత్‌ రైతాంగానికి నష్టం చేకూర్చే మూడు ఆర్డినెన్సులను రద్దు చేయాలని డిమాం డ్‌ చేస్తూ మండల కేవీపీఎస్‌ నాయకులు తహసీల్దార్‌ వెంకటరమణకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌ పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T10:46:50+05:30 IST