మొక్కల పెంపకానికి మియవాకీ పద్ధతి భేష్‌’

ABN , First Publish Date - 2020-06-06T11:10:39+05:30 IST

మియవాకీ పద్ధతిలో భాగంగా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల పెంపకం చేపట్టడం భేష్‌ అని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు.

మొక్కల పెంపకానికి మియవాకీ పద్ధతి భేష్‌’

తలమడుగు, జూన్‌ 5: మియవాకీ పద్ధతిలో భాగంగా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల పెంపకం చేపట్టడం  భేష్‌ అని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం మండలంలోని సుంకిడి, రుయ్యాడి గ్రామాల్లో చేపడుతున్న మియవాకీ పద్ధతి మొక్కల పెంపకం, హారితహారం నర్సరీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హారితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.


నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాల్లో మొక్కలను నాటాలని సూచించారు. జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యాడి, సుంకిడి గ్రామాల్లో జపాన్‌ శాస్త్రవేత్త పద్ధతి లో మియవాకీ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెం చడం అభినందనీయమన్నారు. ఇందులో జడ్పీటీసీ గోక గణే్‌షరెడ్డి, ఎంపీపీ కల్యాణం లక్ష్మిరాజేశ్వర్‌, సుంకిడి సర్పంచ్‌ మహేందర్‌యాదవ్‌, రుయ్యాడి సర్పంచ్‌ పోతరెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రాథోడ్‌, డీపీఓ సాయిబాబా, తహసీల్దార్‌ గంగాధర్‌, ఎంపీడీఓ సునిత, ఈజీఎస్‌ ఏపీవో శ్యాముల్‌, మండల పశువైద్యాధికారి దూద్‌రాంరాథోడ్‌, ఎంపీడీవో దిలీ్‌పకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.  


మావల: పర్యావరణ సమతుల్యానికి పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక మావల పార్క్‌లో శుక్రవారం కలెక్టర్‌ మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం తక్కువగా ఉందని, ప్రభుత్వ ఆదేశా ల మేరకు పట్టణానికి ఆనుకొని ఉన్న అటవి క్షేత్రాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందిం చి ఆ దిశగా పనులు చేపడుతున్నామన్నారు. అనతరం కార్యాలయాన్ని సందర్శించి మండల అధ్యక్షురాలు, జడ్పీటీసీ, సర్పంచ్‌లతో మాట్లాడారు. 


ఆ తర్వాత మావల పార్క్‌ను సఫారీలో సందర్శించా రు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జడ్పీ సీఈవో కిషన్‌, జిల్లా అటవీ అధికారి ప్రభాకర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికా రి రాజేశ్వర్‌రాథోడ్‌, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, అటవీ అభివృద్ధి అధికారి చంద్రశేకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ మధుకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T11:10:39+05:30 IST