నేల మీద ఆకాశం ప్రతిబింబం!

ABN , First Publish Date - 2020-08-11T05:30:00+05:30 IST

నీళ్లలో, అద్దంలో ప్రతిబింబాన్ని చూడొచ్చు. మరి భూమిపై ప్రతిబింబం కనిపిస్తుందా? అని అడిగితే ‘కనిపించదు’ అని ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఈ కింది ఫొటో చూడండి...

నేల మీద ఆకాశం ప్రతిబింబం!

నీళ్లలో, అద్దంలో ప్రతిబింబాన్ని చూడొచ్చు. మరి భూమిపై ప్రతిబింబం కనిపిస్తుందా? అని అడిగితే ‘కనిపించదు’ అని ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఈ కింది ఫొటో చూడండి. ఇందులో  అకాశం ప్రతిబింబం భూమిమీద కనిపిస్తోంది. అదెలా అంటారా? అయితే చదవండి.

  1. ఆకాశం ప్రతిబింబం భూమిపై ఎలా కనిపిస్తోందీ! అంటే అక్కడ ఉప్పు ఎడారి ఉంది. ఆ తెల్లటి ఉప్పు ఎడారిలో ఆకాశం ప్రతిబింబం స్వచ్ఛంగా కనిపిస్తోంది. 
  2. బొలీవియాలోని యుయుని అనే ప్రాంతంలో కనిపిస్తుందీ సుందరదృశ్యం. ఈ ప్రదేశాన్ని ‘యుయుని సాల్ట్‌ ఫ్లాట్స్‌’ అంటారు. ఇక్కడ ఉప్పు మెరిసిపోతూ ఉంటుంది. అందులో ఆకాశం ప్రతిబింబం కనిపిస్తుంది.
  3. నిజానికి ఇక్కడ ఉప్పు నీటి సరస్సు ఉండేదట. అది క్రమంగా ఎండిపోయి ఇప్పుడు ఉప్పు ఎడారిగా మారింది. 
  4. ఇప్పుడీ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారింది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఈ రమణీయ దృశ్యాన్ని చూసేందుకు వెళ్తుంటారు.

Updated Date - 2020-08-11T05:30:00+05:30 IST