కుమార్తెను ఉపాధ్యాయురాలిగా నియమించిన విద్యా మంత్రిని తొలగించాలి

ABN , First Publish Date - 2022-05-18T18:03:06+05:30 IST

పోటీ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ తన కుమార్తెను ఉపాధ్యాయురాలిగా నియమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటు న్న పశ్చిమబెంగాల్‌ విద్యాశాఖ సహాయమంత్రి పరేశ్‌అధికారిని విచారించాలని సీబీఐని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఆయనను..

కుమార్తెను ఉపాధ్యాయురాలిగా నియమించిన విద్యా మంత్రిని తొలగించాలి

కోల్‌కతా, మే 17: పోటీ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ తన కుమార్తెను ఉపాధ్యాయురాలిగా నియమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటు న్న పశ్చిమబెంగాల్‌ విద్యాశాఖ సహాయమంత్రి పరేశ్‌అధికారిని విచారించాలని సీబీఐని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఆయనను మంత్రి మండలి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌లకు కోర్టు సూచించింది. పోటీ పరీక్షలో 77 మార్కులు సాధించిన తనకంటే తక్కువగా 61 మార్కులు మాత్రమే వచ్చిన ఆమెను ఉపాధ్యాయురాలిగా నియమించారని ఓ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం లోపు సీబీఐ అధికారుల ముందు హాజరుకావాలని మంత్రి  పరేశ్‌అధికారిని జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ ఆదేశించారు. 

Updated Date - 2022-05-18T18:03:06+05:30 IST