అక్రమ మైనింగ్‌కు మంత్రి బ్రాండ్‌ అంబాసిడర్‌

ABN , First Publish Date - 2022-07-02T06:19:27+05:30 IST

అనకాపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. మండలంలోని కన్నూరుపాలెం, తీడ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాట్లాడారు.

అక్రమ మైనింగ్‌కు మంత్రి బ్రాండ్‌ అంబాసిడర్‌
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద

  ‘బాదుడే బాదుడు’లో గుడివాడ అమర్‌నాథ్‌పై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపణ 

 ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాల పంపిణీ

కశింకోట, జులై 1 : అనకాపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. మండలంలోని కన్నూరుపాలెం, తీడ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాట్లాడారు. విస్సన్నపేట భూముల వ్యవహారంలో రెవె న్యూ, గనులశాఖ అధికారుల పాత్ర ఉందన్నారు. ఆ భూములపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి ఉందా.. అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈ జీఎస్‌ నిధులను పక్కదారి పట్టిస్తుందన్నారు. మొన్న పంచాయతీ, ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ నిధులు, ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల పీఎఫ్‌ డబ్బులను కూడా కాజేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. అనంతరం  పెరిగిన నిత్యావసర ధరలపై ఉపాధి కూలీలకు కరపత్రాలను పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు కాయల మురళీ, మాజీ వైస్‌ ఎంపీపీ చిరికి సన్యాసినాయుడు, కన్నూరు ఎర్రినాయుడు, సిద్దిరెడ్డి సూర్యనారాయణ, మేడిశెట్టి సన్యాసినాయుడు, అక్కునాయుడు, నైనంశెట్టి రమణారావు, చిరికి చైతన్య, రెడ్డి సూర్యనారాయణ, నానాజీ, బుదిరెడ్డి రామారావు తదితరులు పాల్గొన్నారు. 

వైసీపీ ప్రభుత్వంలో  అన్నీ భారాలే : ప్రగడ

మునగపాక : ప్రజలపై  భారాలు వేయడమే తప్ప వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి చేతగాదని టీడీపీ ఎలమం చిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన మూలపేటలో  శుక్రవారం రాత్రి జరిగిన బాదుడే బాదుడులో మాటా ్లడారు. జగన్‌ పాలపై ప్రజలు విసుగు చెందారని, రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నార న్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా  అధ్య క్షురాలు ఆడారి మంజు, టీడీపీ నాయకులు జేకే బ్రదర్స్‌, మళ్ల వరహా నరసింగరావు, ఆడారి కాశీరావు, కాండ్రేగుల నాగేంద్ర, కొలుసు వెంకట అప్పారావు, నాగేశ్వరరావు, మురళీ, దొడ్డి రమేష్‌, దాడి శ్రీను, అబ్బాయినాయుడు, శరగడం యోగి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:19:27+05:30 IST