కనీస వేతనాల చట్టం అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-01-20T06:28:17+05:30 IST

రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని, చట్ట ప్రకారం కార్మికులకు వేతనాలు అందేటా చూడాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు.

కనీస వేతనాల చట్టం అమలు చేయాలి
డీసీఎల్‌తో సమావేశమైన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

- సమస్యల పరిష్కారానికి కార్మిక శాఖ చొరవ చూపాలి

- డీఎల్‌సీతో రామగుండం ఎమ్మెల్యే చందర్‌ భేటీ

జ్యోతినగర్‌, జనవరి 19 : రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని, చట్ట ప్రకారం కార్మికులకు వేతనాలు అందేటా చూడాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌(సెంట్రల్‌) శ్రీనివాసులుతో ఎమ్మెల్యే చందర్‌ భేటీ అయ్యారు. ఎన్టీపీసీ కార్మిక సమస్యలకు సంబంధించి ఆయన డీసీ ఎల్‌కు వినతిపత్రం అందజేశారు. కనీస వేతనాల చట్టాన్ని ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు అమలు చేసేలా చొరవ చూపాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌ డిమాండ్లను నెరవేర్చేందుకు అవస రమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల సమస్యల విషయంలో త్వరలో లేబర్‌ కమిషనర్‌ను కలుస్తానని ఎమ్మెల్యే చందర్‌ తెలిపారు. ఈ విషయంలో స్పందించిన డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ స్పందిస్తూ కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా నని, కార్మికుల కోర్కెలు, సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చా రు. ఎమ్మెల్యేతో పాటు వివిధ సంఘాల నాయకులు ఇజ్జగిరి భూమయ్య, శంకర్‌, లక్ష్మణ్‌, రాజయ్య, రాజేశ్‌ డీసీఎల్‌ను కలిశారు. 

Updated Date - 2022-01-20T06:28:17+05:30 IST