Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్యాంక్‌కు వెళ్లిన మిలియనీర్‌ను అడ్డుకున్న సిబ్బంది.. చిన్న మాటన్నందుకు అధికారులకు చెమటలు పట్టించాడు..

బ్యాంకుల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. అందులోనూ ప్రస్తుత కరోనా సమయంలో నిబంధనలను ఇంకా కఠినతరం చేశారు. దీంతో బ్యాంక్‌కు వెళ్లి పని పూర్తి చేసుకుని బయటికి వచ్చేందుకు చాలా సమయం పట్టే పరిస్థితి నెలకొంది. అయితే చైనాలో బ్యాంక్‌కు వెళ్లిన సమయంలో అవమానం జరిగిందనే కారణంతో ఓ మిలియనీర్‌.. బ్యాంక్ సిబ్బందిపై ఫైర్ అయ్యాడు. తీరా అతని మాట విని సిబ్బంది, అధికారులకు చెమటలు పట్టాయి. వివరాల్లోకి వెళితే..

చైనాలోని బీజింగ్‌ బ్యాంక్ ఆఫ్‌ షాంఘైలో ఓ మిలియనీర్‌కు అకౌంట్ ఉంది. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే మాస్కు లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మాస్కు లేనిదే అనుమతించమని తేల్చి చెప్పారు. దీంతో నన్నే అడ్డుకుంటారా... అంటూ ఆ మిలియనీర్ ఫైర్ అయ్యాడు. అంతటితో ఆగకుండా లోపలికి వెళ్లి అధికారులతో గొడవకు దిగాడు. వెంటనే తన అకౌంట్‌లో ఉన్న మొత్తం డబ్బులను వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులను విత్‌డ్రా చేసుకునే సమయంలో డబ్బులను చేతులతో చెక్కించాలని కస్టమర్ కోరితే.. అలాగే చేయాల్సి ఉంటుందని చైనాలో ఓ నియమం ఉంది. దీంతో అన అకౌంట్‌లోని 58మిలియన్ యువాన్ల(రూ.68కోట్లు)ను చేతులతో లెక్కించి ఇవ్వాలని సిబ్బందికి.. ఆ మిలియనీర్ ఆర్డర్ వేశాడు. అయితే అక్కడ రోజుకు 5 మిలియన్ల యువాన్‌(మన కరెన్సీలో 5,87,31,928.45)లు మాత్రమే తీసుకోవచ్చు.


దీంతో 5మిలియన్ల యువాన్‌లను చేతులతో లెక్కించేందుకు సిబ్బందికి రెండు గంటల సమయం పట్టిందట. మిగతా డబ్బుల కోసం రోజూ వస్తుంటానని షాక్ ఇచ్చాడు. తన డబ్బులను వేరే బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement