Viral news: అతడి తల విలువ రూ.14కోట్లు.. విషయం తెలిస్తే అవాక్కవుతారు..!

ABN , First Publish Date - 2021-10-11T00:01:44+05:30 IST

మెక్సికోలో ఉంటున్న 23 ఏళ్ల కళాకారుడు ర్యాపర్‌ డాన్‌ సుర్‌కు.. అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలనే తపన ఉండేది. అందుకోసం పెద్ద సాహసమే చేశాడు. అంతా జుట్టు బాగుండాలని కోరుకుంటారు.

Viral news: అతడి తల విలువ రూ.14కోట్లు.. విషయం తెలిస్తే అవాక్కవుతారు..!

తల విలువ రూ.14కోట్లు అంటే.. అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కొందరు అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలని తపన పడుతుంటారు. ఏదో ఒక అంశంలో విభిన్నంగా ఉంటూ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. తద్వారా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే..  


మెక్సికోలో ఉంటున్న 23 ఏళ్ల కళాకారుడు ర్యాపర్‌ డాన్‌ సుర్‌కు.. అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలనే తపన ఉండేది. అందుకోసం పెద్ద సాహసమే చేశాడు. అంతా జుట్టు బాగుండాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతైనా ఖర్చు పెడతారు. జుట్టు లేని వాళ్లు కొత్తగా మొలిపించుకునేందుకు ఆధునిక చికిత్స సైతం చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈ మెక్సికన్ యువకుడు మాత్రం.. తన జుట్టును పూర్తిగా తొలగించాడు. ఆ స్థానంలో ఏకంగా బంగారు గొలుసులను వెంట్రుకల తరహాలో ఏర్పాటు చేయించుకున్నాడు.


తన కలను నెరవేర్చుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అంతవరకూ బాగున్న తన జుట్టును పూర్తిగా తొలగించుకున్నాడు. మన కరెన్సీలో సుమారు రూ.14కోట్లు ఖర్చు చేసి.. తల పైభాగంలో మొత్తం వివిధ బంగారు గొలుసులతో అమర్చుకున్నాడు. తద్వారా తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన వారంతా.. ‘‘ ర్యాపర్ జాగ్రత్త.. ఎవరన్నా బంగారు జుట్టును లాక్కోగలరు..’’ అంటూ చమత్కరిస్తున్నారు.

Updated Date - 2021-10-11T00:01:44+05:30 IST