తాండూరు చరిత్రలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

ABN , First Publish Date - 2020-05-25T09:57:11+05:30 IST

తాండూరు పట్టణంలో మొట్ట మొదటి సారి రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తాండూరు చరిత్రలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

రెండు రోజులుగా తీవ్రమైన వడగాడ్పులు

బయటకు వెళ్లేందుకు జంకుతున్న ప్రజలు

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి


తాండూరు :  తాండూరు పట్టణంలో మొట్ట మొదటి సారి రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం తాండూరు చరిత్రలోనే మొదటి సారి. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు నమోదైన గరిష్ణ ఉష్ణోగ్రతల వివరాలిలా ఉన్నాయి. 18న 41.8 డిగ్రీలు, 19న 40.3 డిగ్రీలు, 20న 36.9 డిగ్రీలు, 21న 37.0 డిగ్రీలు, 22న 44.3 డిగ్రీలు,  23న 44.5డిగ్రీలు, 24న ఆదివారం 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా రెండు రోజులుగా తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. 


జాగ్రత్తలు పాటించాలి..డాక్టర్‌ జయప్రసాద్‌, తాండూరు

అత్యవసరం అయితే తప్ప ఎండలో బయటికి వెళ్లకూడదు. తెల్లటి కాటన్‌ దుస్తులు ధరించాలి. తరుచూ నీటిని తాగుతూ ఉండాలి. తీవ్ర జ్వరం, బీపీ పడిపోవడం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, మూత్రం నిలిచిపోవడం వంటి లక్షణాలు ఉంటే వడదెబ్బకు గురైనట్లుగా గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలి.


Updated Date - 2020-05-25T09:57:11+05:30 IST